రిలయన్స్ రిటైల్ కు చెందిన ఓమ్నీ ఛానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్ ఫామ్ ‘టీరా’ తన తొలి స్టోర్ ను హైదరాబాద్ లో ప్రారంభించింది. ఈ సంవత్సరం ప్రారంభించిన జియో వరల్డ్ డ్రైవ్, ఇన్ఫినిటీ మాల్ మలాడ్ వద్ద ముంబైలో తన స్టోర్లు విజయవంతం కావడంతో.. ఈ బ్రాండ్ కొత్తగా హైదరాబాద్ స్టోర్‌ను వ్యూహాత్మకంగా నగరంలో నిరంతరం సందడిగా ఉండే శరత్ సిటీ మాల్ లో ప్రారంభించింది.
బ్రాండ్ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. వైబ్రెంట్ సిటీ అయిన హైదరాబాద్‌కు ఉత్తమ సౌందర్య ఉత్పత్తులు, అనుభవాలను తీసుకురావాలనే నిబద్ధతకు ఈ స్టోర్ ఒక నిదర్శనం.
‘టీరా’ కొత్త తరం కస్టమర్ల కోసం అంతర్జాతీయ, స్వదేశీ బ్యూటీ బ్రాండ్ల మంచి కలయికను అందిస్తుంది. ఎలివేటెడ్ షాపింగ్ అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తుంది.
‘టీరా’ స్టోరును సందర్శించినప్పుడు కస్టమర్లు ఇక్కడ అనుభవించేందుకు అనేక ఆహ్లాదకరమైన టచ్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడి వెండింగ్ మిషన్ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇది ప్రతి కస్టమర్ తమ ఇంటికి తీసుకెళ్లడానికి బ్యూటీ ట్రీట్లు, శాంపిల్స్‌ను పంపిణీ చేస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన ‘టీరా’ సిగ్నేచర్ లుక్స్” వినియోగదారుల ఆసక్తిని పొందాయి. వారు మా అత్యంత నైపుణ్యం కలిగిన బ్యూటీ అడ్వైజర్ల నుంచి తమకు ఇష్టమైన కాంప్లిమెంటరీ గ్లామర్ లుక్‌ను కూడా పొందవచ్చు. ప్రత్యేకమైన ఎన్‌గ్రేవింగ్ మిషన్‌తో ఉన్న డెడికేటెడ్ గిఫ్టింగ్ స్టేషన్లు వినియోగదారులకు పర్సనలైజ్డ్ గిఫ్టులు ఇవ్వడానికి సహాపడతాయి. వీటిద్వారా వారు తమ గిఫ్టులను మరింత ప్రత్యేకంగా చేయించుకోవచ్చు.
రిటైల్ స్టోర్స్ లో ఫ్రాగ్రెన్స్ ఫైండర్ ఒకటి కూడా ఉంది. రీటైల్ వాతావరణంలో ఇలాంటిది ఉండటం ఇదే మొట్టమొదటి సారి. కస్టమర్లు తమకు నచ్చిన పెర్‌ఫ్యూంలను కేటగిరైజ్ చేసిన సువాసనల ఆధారంగా ఎంపిక చేసుకోవడానికి దీనివల్ల వీలు కుదురుతుంది.
‘టీరా’ హైదరాబాద్ స్టోర్ బ్యూటీ రిటైల్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చాలని కోరుకుంటుంది. వినియోగదారులు వారి ప్రత్యేకమైన సౌందర్య ప్రాధాన్యతలను అన్వేషించడానికి, స్వీకరించడానికి ఇంటరాక్టివ్, సాంకేతిక-ఆధారిత వాతావరణాన్ని ఇది అందిస్తుంది. ‘టీరా’ నిరంతరం బ్యూటీ రిటైల్ ల్యాండ్ స్కేప్ ను పునర్నిర్మిస్తున్నందున, ఇది అందం పట్ల ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారందరికీ సమ్మిళిత, సాధికారిక సౌందర్య ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది.
కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీ, సుహానా ఖాన్ లతో ‘ఫర్ ఎవ్రీ యు’ పేరుతో ‘టీరా’ ఇటీవల హై ఇంపాక్ట్ 360 డిగ్రీల క్యాంపెయిన్ ను ఆవిష్కరించింది. ఈ ప్రచారం వ్యక్తులు ఎదుర్కొనే విభిన్న పాత్రలు, భావోద్వేగాలు, మనోభావాలను గౌరవిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను ప్రేరేపించడం, వారి సౌందర్య అన్వేషణ ప్రయాణంలో వారు ఎక్కడ ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా వారి నిజమైన స్వభావాన్ని స్వీకరించడానికి, వ్యక్తీకరించడానికి వ్యక్తులను ప్రోత్సహిస్తుంది. ‘టీరా’ యాప్‌ను ఇప్పటికే 1.5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇది పెరుగుతున్న ప్రజాదరణను సూచిస్తుంది. ‘‘టీరా’ విస్తృతమైన రీచ్ భారతదేశం అంతటా 98% పిన్ కోడ్‌లను కవర్ చేస్తుంది, ఇది 100 కి పైగా నగరాల్లోని వినియోగదారులకు చేరుతుంది.
మరింత సమాచారం కోసం, ‘టీరా’ అందించే వైవిధ్యమైన సౌందర్య ఆఫర్లను తెలుసుకోవడానికి, హైదరాబాద్ లోని శరత్ సిటీ మాల్ లో కొత్తగా ప్రారంభించిన స్టోర్ ను సందర్శించండి. ఈ ఉత్తేజకరమైన సౌందర్య పరివర్తనలో భాగం అవ్వండి!
స్టోర్ చిరునామా:
అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్,
శరత్ సిటీ మాల్, హైదరాబాద్, గచ్చిబౌలి – మియాపూర్ రోడ్, వైట్ ఫీల్డ్స్, హైటెక్ సిటీ, కొండాపూర్,
హైదరాబాద్,
తెలంగాణ 50008
Discussion about this post