బుచ్చినాయుడుకండ్రిగ: రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటుగా లాగేసుకున్న పంచాయితీ నిధులను తిరిగి ఇవ్వాలని తెదేపా తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యదర్శి సముద్రాల సుధాకర్ నాయుడు ప్రకటనలో డిమాండ్ చేశారు.
రాజ్యాంగ పరంగా సర్పంచ్ గా ఎన్నికైన వ్యక్తి హక్కులను కాలరాయడం వైసీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులతో పాటు జనరల్ ఫండును కూడా లాక్కోవడం చూస్తుంటే ప్రజల బాగోగుల కన్నా ఓట్లు కొల్లకొట్టడమే ధ్యేయంగా పెట్టుకునన్నట్లుందన్నారు.
గ్రామాలలో కనీస అవసరాలను తీర్చలేక సర్పంచులు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే భవిష్యత్తులో ఏ ఒక్కరూ ముందుకి రాని పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవస్థలను నిర్వీర్యం చేసి తద్వారా పేదలను నిరుపేదలుగా మార్చేస్తున్నారన్నారు.
పంచాయితీ నిధులను వెనక్కించి సర్పంచులకు న్యాయం చేయాలని కోరారు.
.