శ్రీకాళహస్తి ని రెవెన్యూ డివిజన్గా చేయడం హర్షణీయం అని, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషికి నిదర్శనమని శ్రీకాళహస్తీశ్వరాలయం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు.
గత 30 ఏళ్లుగా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్గా చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ నాటి పాలకులు క్యాబినెట్ మంత్రులు ఉన్న సాధించలేకపోయారు అని, అయితే నేడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వినూత్న ఆలోచనలతో ప్రజల బాధలు కష్టసుఖాలు తెలుసుకుంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారం చేస్తున్నారన్నారు.
ఇందులో భాగంగానే కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదన రాగానే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చొరవ చూపి సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి భూ సమస్యలు, ప్రజల ఇబ్బందులు, రానున్న రోజుల్లో శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం గా పరిశ్రమల కేంద్రంగానూ మారనున్న దృష్ట్యా రెవెన్యూ డివిజన్గా చేయాలని విజ్ఞప్తి చేశారు అన్నారు.
ముఖ్యమంత్రి స్వయంగా కలిసి విన్నవించడం తదుపరి అసెంబ్లీలోనూ ప్రస్తావించి రెవెన్యూ డివిజన్ చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు అన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృషి మూలంగా నేడు శ్రీకాళహస్తి రెవిన్యూ డివిజన్గా ఏర్పాటు అయింది అన్నారు.
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృషిని యువత గుర్తించి నియోజకవర్గాన్ని బహుముఖ అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి శ్రీకాళహస్తి ప్రజలందరూ రుణపడి ఎల్లవేళలా ఆశీస్సులు అందిస్తూ సహకరించాలని మరింత ఉన్నత పదవులు పొందే విధంగా ఆశీర్వదించాలన్నారు.
రానున్న రోజుల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం గత 30 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపుతున్నారని అన్నారు
.