ఎలాంటి షేడ్ ఉన్న పాత్రనైనా అలవోకగా చేసే ఏకైక హీరోయిన్ గా సమంత ఇప్పటి హీరోయిన్లలో పేరు తెచ్చుకున్నారు. అలాంటి సమంత ఇప్పుడు ఓ ఐటెం సాంగ్ లో సందడి చేయబోతున్నారు. సమంతలో వెర్సటైల్ పెర్ఫార్మెన్స్ ను కోరుకునే ఫ్యాన్స్‌కు కనువిందు చేయబోతున్నారు.
తన చిత్రాలలో ఐటెం సాంగ్ కు ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసే, ఐటెం సాంగ్ కోసమే ప్రేక్షకులు ఎగబడి వచ్చేలా చేసే టెక్నిక్ తెలిసిన దర్శకుడు సుకుమార్ తాజా చిత్రం పుష్ప ది రైజ్ లో సమంత ఐటెం సాంగ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో స్టార్ హీరోయిన్ సమంత కాలు కదపనున్నారు. పుష్ప 5వ పాట మరింత స్పెషల్‌గా ఉండబోతుంది.. సమంత ఎంట్రీతో ఆ పాట మరింత స్పెషల్ అయిపోయింది అంటూ చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసారు. కెరీర్‌లో మొదటి సారి స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు సమంత.
పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి, సామి సామి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నవంబర్ 19న ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ సాగే నాలుగో సింగిల్ విడుదల కానుంది
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

.

Discussion about this post