చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి .ప్రజాసంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి చేకూర్చే విషయంలో ఆధార్ను అనుసంధానం తప్పనిసరి చేసింది.
ఈ నేపథ్యంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకోవడం అనివార్యంగా మారింది. ఈ క్రమంలో మీ సేవ కేంద్రాల ద్వారా గతంలో ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వం గ్రామ సచివాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది .
ఇందులో భాగంగానే దాదాపు 500 సేవలను ప్రస్తుతం గ్రామ సచివాలయం ద్వారా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు మీసేవా కేంద్రాల్లో ఆధార్ సేవలు నిలిచిపోయాయి.
దీంతో సత్యవేడు పట్టణంలో ఆధార్ కష్టాలు మొదలయ్యాయి .స్థానిక తంతి తపాలా శాఖ లో మాత్రం కొనసాగుతున్న ఆధార్ సేవలు తీసినట్టుగా మారడంతో మండల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
గత ఆరు నెలలుగా ఆధార్ సేవల కోసం దాసుకుప్పం సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వద్దకు పరుగులు తీశారు .అయితే ఆధార ఇబ్బందులను గుర్తించిన బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు సత్యవేడు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో వారం రోజుల క్రితమే ఆధార్ సేవలను ప్రారంభించారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవడం ,ఆధార్ కార్డులో చిరునామా మార్పు చేసుకోవడం , పేర్లు వంటివి మార్చుకోవడం ,వేలిముద్రలు అప్డేట్ చేసుకోవడం , ఆధార్తో మొబైల్ నెంబర్ను అనుసంధానం చేసుకోవడం వంటి పలు సేవలను అందిస్తున్నట్టు స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆధార్ నమోదు ఆపరేటర్ నవీన్ కళ్యాణ్ వివరించారు.
పైగా వయసు 16 ఏళ్లు లోపు ఉన్న వారందరికీ ఉచితంగా కొత్త ఆధార్ కార్డు నమోదు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు .మిగిలిన సేవలకు వంద రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఆధార్ నమోదు కోసం జనన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
సెలవు రోజుల్లో తప్ప మిగిలిన అన్ని పనిదినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటలకు బిఎస్ఎన్ఎల్ ఆధార్ సెంటర్ నడుస్తుందని ఈ సందర్భంగా ఆధార్ ఆపరేటర్ నవీన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సత్యవేడు మండల ప్రజలు బిఎస్ఎన్ఎల్ ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు .
.