చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో బుధవారం అన్నప్రాసన కార్యక్రమం జరిగింది.
ఇందులో భాగంగానే బాలకృష్ణాపురం అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త ఝాన్సీ ఆధ్వర్యంలో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ఇందుమతి హాజరయ్యారు.
ఆరు నెలలు పూర్తి ఏడో నెలలో అడుగిడిన శుభలేఖ కుమారుడు దిలీప్ కుమార్ బిడ్డకు గ్రామ సర్పంచ్ ఇందుమతి అన్నప్రాసన చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పలు పథకాలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో శారీరక ఎదుగుదలకు ఇప్పటికే బలవర్థకమైన ఆహారాన్ని పంపిణీ చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
దీంతోపాటు ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు సకాలంలో పౌష్టికాహారం లోపం తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే అన్నప్రాసన చేయించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు కుసుమ పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు .
.