• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 23, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

satyavedu news లూయీస్ బ్రెయిలీ జయంతి

admin by admin
January 4, 2022
0
satyavedu news లూయీస్ బ్రెయిలీ జయంతి

లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవం సందర్భంగా పిచ్చాటూరు మండలం భవిత కేంద్రం లో మండల విద్యాశాఖ అధికారిణి  హేమ మాలిని సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా MEO మాట్లాడుతూ ఫ్రెంచ్ విద్యా వేత్త , సృష్టికర్త, అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు, ఎన్నో చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన లూయిస్ బ్రెయిలీ అనే కొనియాడారు.

కళ్ళు కనిపించని వారికి భవిష్యత్తుపై ఆశ కల్పిస్తూ లూయిస్ బ్రెయిలీ జ్ఞాన జ్యోతిని వెలిగించారు. కేవలం స్పర్శతోనే అక్షరాలను గుర్తు పట్టి.. అంధులకు ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే విధంగా ఓ భాషను కనిపెట్టారు లూయిస్ బ్రెయిలీ. దీంతో ఎందరో అంధులు చదువుకుంటున్నారు.

మంచి మంచి పదవులను చేపట్టి తాము ఎవరికీ ఏ విధంగా తీసిపోము అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు. పుట్టుకతోనే అంధుడైన కట్టా సింహాచలం పట్టుదలతో చదువుకున్నారు.

ధృడ సంకల్పంతో ముందుకు సాగి.. 2018 ఐఏఎస్ బ్యాచ్ లో 457వ ర్యాంకు సాధించారు. ముస్సోరీలో శిక్షణ పొందిన సింహాచలం సొంత రాష్ట్రమైన ఏపీలోనే ఐఏఎస్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు కేరళలోని ఎర్నాకుళం జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రాంజల్, ప్రముఖ గాయని గాయత్రి శంకరన్ వంటి వారు అనేక మంది చీకటిని జయించి విద్యావంతులుగా, ఉద్యోగులుగా రాణిస్తున్నారు.

అయితే జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జయంతిని వరల్డ్ బ్రెయిలీ డే గా జరుపుకుంటున్నాం. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ బ్రెయిలీ డేను అధికారంగా గుర్తించినప్పటి నుంచి జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

ఫ్రెంచ్ విద్యావేత్త అయిన లూయిస్ 1809 లో జన్మించారు. తన నాల్గగవ ఏట ఓ ప్రమాదంలో చూపుతో పాటు.. రెండు కాళ్ళను పోగొట్టుకున్నారు. కాళ్లు, కళ్ళు కోల్పోయిన లూయిస్ అధైర్య పడలేదు.. పారిస్‌లో అంధులకు చదువు చెప్పే ఓ పాఠశాలలో చేరారు. అక్కడ అంధులకు లావుగా ఎత్తుగా ఉండే అక్షరాలతో.. విద్యనభ్యసిస్తూ.. విద్యార్థిగా మంచి ప్రతిభను కనబరిచారు. అదే స్కూల్ లో 17 ఏళ్ల వయసులోనే టీచర్ గా చేరారు. అయితే “తాను అంధుడిగా నేర్చుకున్న అక్షరాల కూర్పులో ఏదో లోపం ఉందని భావించిన లూయిస్.. అంధులు లిపిని సులభంగా నేర్చుచుకునేలా పరిశోధనలు” చేశారు.

“అక్షరాలను చుక్కల కూర్పుతో అంధులు గుర్తు పట్టేలా ‘బ్రెయిలీ లిపి’ని సృష్టించారు”.. దీంతో కంటి చూపులేని వారు చదువుకోవడం మరింత సులభంగా మారింది.అప్పటి నుంచి ప్రపంచంలో అనేక పుస్తకాలను బ్రెయిలీ లిపిలో ముద్రిస్తున్నారు. భగవద్గీత వంటి అనేక గ్రంధాలు కూడా బ్రెయిలీ లిపిలో ముద్రించారు. ఇక యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాల్లో బ్రెయిలీ లిపిలో సమాచారం ఉండడం తప్పని సరిచేసింది.

ఈరోజు అంధులు చదువుకోవడానికి జ్ఞానం సంపాదించడానికి కారణమైన లూయిస్ కృషి ని గుర్తిస్తూ వరల్డ్ బ్రెయిలీ డే గా జరుపుకుంటున్నాం. ఆయన స్మృతిలో భారత ప్రభుత్వం లూయిస్ బ్రెయిలీ బొమ్మతో రెండు రూపాయల కాయిన్ కూడా రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమానికి 104 మదనపల్లి డివిజన్ డాక్టర్ ఉదయ్ కుమార్ గారూ కేకు స్వీట్స్ పిల్లలకు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు తల్లిదండ్రులు మరియు IEDSS ఎన్ . వెంకటేష్, సహితఉపాధ్యాయుడు కె. చిరంజీవి, ఆయా పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం పిల్లలకు డాన్సింగ్, డ్రాయింగ్, క్యారం బోర్డ్, రన్నింగ్ రేస్ ఆటలు పెట్టి బహుమతులు ఎంఈఓ గారి చేతులమీదుగా ఇవ్వడం జరిగింది.

Tags: localSatyavedu localsatyavedu newssatyavedu updatesచిత్తూరు జిల్లాసత్యవేడు అప్‌డేట్స్సత్యవేడు న్యూస్సత్యవేడు వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply