భారతదేశాన్ని ఒకే తాటిపైకి నడిపించేది రాజ్యాంగ మేనని చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు.
రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటేశులు మాట్లాడుతూ 1950 జనవరి 26 వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకుని నేటికీ ఇవాళ్టికి 72 ఏళ్లు పూర్తయిందన్నారు.
రాజ్యాంగం నియమ నిబంధనలకు లోబడే ప్రభుత్వాలు పరిపాలన కొనసాగించాలన్నారు. ఇందులో భాగంగానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజు నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడాన్ని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలోనే నవంబర్ 26న జాతీయన్యాయ దినోత్సవంగా కాకుండా, రాజ్యాంగ దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నటు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి సలీం ,అధ్యాపకులు సుధాకర్ , శివరాం , కృష్ణవేణి ,సోనియా ,గీత ,పలువురు విద్యార్థులు పాల్గొన్నారు .
.