చిత్తూరు జిల్లా సత్యవేడు సన్ రైజ్ విద్యాసంస్థలలో శుక్రువారం భారత రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు.
జాతీయ పతాకంపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తాహాశీల్ధార్ శ్రీదేవి పాల్గోన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రజా స్వామ్యాన్ని ఏకతాటిపై నడిపే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఆయన సేవలను కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవం సంdర్భంగా కోనేటి సెంటర్ కు చెందిన నిరుపేదలకు తాహాశీల్ధార్ చేతులు మీదుగా కరస్పాండెంట్ సతీష్ బియ్యంను పంపిణీ చేశారు.
సన్ రైజ్ విద్యాసంస్థల సేవలను తాహాశీల్ధార్ శ్రీదేవి అభినందించారు. అనంతరం వ్యాసరచన,వకృత్వ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఈకార్యక్రమంలో ప్రెసిడెంట్ ప్రియాంక,ప్రిన్సిపాల్ శోభ, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు హరినాధుడు, సుగుణవతి, నిర్మల, ఉమ, దిలీప్ కుమార్, ఇళయరాజ, ప్రీతి, అరుల్ దాస్, కళ్యాణి, జ్యోత్స్న, నివేద, కోకిల, సుప్రియ, శిరీష, శ్యామిలి, సుధారాణి, ప్రియ లు పాల్గోన్నారు.
.