తమ సీఎస్సార్ చర్యల్లో భాగంగా శ్రీసిటీ ఫౌండేషన్, ఆస్ట్రోటెక్ స్టీల్స్ పరిశ్రమ సంయుక్తంగా శ్రీసిటీ పరిధిలోని 20 ప్రభుత్వ పాఠశాలలకు ప్రాథమిక చికిత్స కిట్లను సోమవారం పంపిణీ చేశారు.
1500 రూపాయలు విలువ గల 26 రకాల వైద్య వస్తు పరికరాలు కలిగిన ఒక్కో కిట్ ను ఒక్కో స్కూల్ కు పంపిణీ చేశారు.
శ్రీసిటీ కస్టమ్స్ ఆఫీస్ స్పెసిఫైడ్ ఆఫీసర్ ఎస్.మధు బాబు, ఏడీసీ కె.వి.వి.సత్యనారాయణ, ఆస్ట్రోటెక్ స్టీల్స్ ప్రతినిధి అబ్దుల్ ఖాదర్ ఈ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కిట్ లను అందచేశారు.
తమ పాఠశాలల విద్యాభివృద్ధిలో భాగంగా పలు రకాల మౌళిక వసతుల పెంపుకు నిరంతర ప్రోత్సాహం అందచేస్తున్న శ్రీసిటీ ఫౌండేషన్, ఇతర పరిశ్రమ యాజమాన్యాలకు ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు శ్రీసిటీ సిబ్బంది, పలువురు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
.