స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు బెడన్ పావెల్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో థింకింగ్ డే ను ఘనంగా నిర్వహించారు. బెడన్ పావెల్ చిత్రపటానికు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో సన్నిధి వీధిలోని కంచి కామకోటి పీఠం వృద్ధాశ్రమంలోని వృద్దులకు పండ్లు, బిస్కెట్లు పంచి పెట్టారు.
ఈ సందర్భంగా స్కౌట్స్ కౌన్సిల్ మాజీ మెంబర్ టి. రమేష్ బాబు, కో ఆర్డినేటర్ ఎం. ఉమేష్ రావు మాట్లాడుతూ బెడన్ పావెల్ స్పూర్తితో స్కౌట్స్ అండ్ గైడ్స్ సామాజిక సేవా కార్యక్రమాలల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.
చదువుతో పాటు సేవ చేసేందుకు స్కాట్ అండ్ గైడ్స్ ఉద్యమంలో చేరాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్కౌట్ మాస్టర్ అజారుద్దీన్, RPBS హై స్కూల్, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలల గైడ్ కెప్టెన్లు నిర్మల, సులోచన, లీడర్ సుబ్బు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అంతగా ముందు హఠాన్మరణం చెందిన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ మృతికి సంతాపం సూచకంగా కొద్దిసేపు మౌనం పాటించారు.
.