శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు తలపెట్టిన “విద్యారంగ పరిరక్షణ బస్ యాత్ర” జయప్రదం చేయాలని SFI జిల్లా ఉపాధ్యక్షులు రవి, ఉరుకుందు, SFI SV యూనివర్సిటీ కార్యదర్శి హేమంత్ కుమార్ లు పిలుపునిచ్చారు.
వారు శ్రీకాళహస్తి లోని ప్రభుత్వ హాస్టల్, డిగ్రీ కళాశాల, మహిల డిగ్రీ కళాశాల లో కరపత్రాలు ఇచ్చి ,వాల్ పోస్టర్స్ ను విడుదల చేసారు.
వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి లోని ప్రభుత్వ విద్యాసంస్థలను వెంటనే నాడు-నేడు కింద చేర్చి ఆధునికీకరణ చేయాలని, హాస్టళ్లలో కాస్మొటిక్, మెస్స్ చార్జీలను పెంచి విద్యార్థులు కు పౌష్టికాహారం అందించాలని, ఎయిడెడ్ విద్యాసంస్థలు కొనసాగించాలని,
స్కా లర్షిప్, రియంబర్స్ మెంట్ నువిడుదల చేయాలని, పరిశోధక విద్యార్థులు కు 8000 రూపాయలు ఫెలోషిప్ ఇవ్వలని రాష్ట్ర వ్యాప్తంగా SFI ఆధ్వర్యంలో పోలీసులు ఎన్ని రకాలుగా నిర్బంధించిన యాత్ర కొనసాగుతుందని..
శ్రీకాళహస్తి కు మార్చ్ 1వ తేదీన 11 గంటలకు వస్తుందని ఈ బస్ యాత్రలో విద్యార్థులందరు పాల్గొన్న జయప్రదం చేయాలని వారు కోరారు.
.