తెరవెనుకనుంచి మెప్పించిన వారు తెరమీదికి రావడం సినిమా పరిశ్రమలో కొత్తేమీ కాదు. ప్రస్తుతం అందాల గాయనిగా పేరున్న చిన్మయి కూడా అదే ప్రయత్నంలో ఉంది. అక్కినేని వారి మూడోతరం వారసుడి చిత్రంతో వెండితెర ఎంట్రీకి సిద్ధమవుతుండడమే విశేషం.
అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాతో సింగర్ చిన్మయి బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్నారు.
ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో సింగర్ చిన్మయి ఈ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకురాలిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి.. అఖిల్ సినిమాలో తొలిసారి స్క్రీన్ పై కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ నచ్చడంతో చిన్మయి తెర ముందుకు వస్తున్నారు.
చిన్మయి ఇన్నాళ్లూ తన తీయని స్వరంతో ఎందరో హీరోయిన్లకు గాత్ర దానం చేసి.. ప్రేక్షకులను సమ్మోహనపరచిన చిన్మయి.. నేరుగా తెరమీదికి వచ్చి ఇంకెంతగా వలపుల వల విసురుతుందో చూడాలి.
.