శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డికి మంత్రి పదవి రావాలని కోరుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామికి శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం 301 టెంకాయలు కొట్టారు.
ఈ సందర్భంగా ట్రస్టు వ్యవస్థాపకులు మల్లెంబాకం ముని కృష్ణారెడ్డి మాట్లాడుతూ… బియ్యపు మధు శ్రీకాళహస్తి అభివృద్ధి కార్యసాధకులని… కరోనా సమయంలో ఇంటికి పెద్ద కొడుకు వలె ప్రతి గడపగడపకు నిత్యావసర సరుకులు అందించి తన సేవవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు.
మధు అన్న అంటే అభివృద్ధి… అభివృద్ధి అంటే మదన్న అన్నారు. జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణలో మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని తద్వారా మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామిని ప్రార్థించి టెంకాయలు కొట్టామన్నారు. ఈ
కార్యక్రమంలో హరే రామ హరే కృష్ణ సభ్యులు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రకాశం పంతులు, మాపేటి సుబ్రహ్మణ్యం రెడ్డి, శివ కుమార్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.