మానవసేవే మాధవసేవ అని చిత్తూరు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అధ్యక్షులు సామాను శ్రీధర్ రెడ్డి (ఎస్ ఎస్ ఆర్) అన్నారు.
బుధవారం పట్టణంలోని వెంకటగిరి బస్ స్టాండ్ జడ్పీ హైస్కూల్ సమీపంలో ఎస్ ఎస్ ఆర్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మొదటిరోజు శీతలపానీయాలు, మజ్జిగ, పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్ ఎస్ ఆర్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజల దాహార్తి తీర్చేలా ఎస్ ఎస్ ఆర్ యువత ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి శ్రీకాళహస్తి పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న వారికి ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు, అదేవిధంగా శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే యాత్రికులకు ఎండ వేడిమి నుంచి దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
నీరు ప్రాణ దానంతో సమానమని… రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడంలో యువత చొరవ చూపి ముందుకు రావాలని కోరారు. ఈ ఏడాది ఎండలు తీవ్రత ఎక్కువగా ఉందని వృద్ధులు, చిన్నపిల్లలు ,విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చలివేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సామాను శ్రీధర్ రెడ్డి కి ఎస్ ఎస్ ఆర్ యువత, ఎస్ ఎస్ ఆర్ అభిమానులు, ఘన స్వాగతం పలికి శాలువాతో భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎస్ ఎస్ ఆర్ యువత, ఆటో కార్మికులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
.