తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర దేవదాయశాఖ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దిరాజు రెవిన్యూశాఖ నుంచి డిప్యుటేషన్ పై దేవాదాయశాఖకు వచ్చారు. రెండేళ్ల పాటు శ్రీకాళహస్తీశ్వర ఆలయ కార్యనిర్వహణాధికారిగా పని చేశారు. ప్రస్తుతం పెద్దిరాజును రవాణా, రోడ్లు, భవనాలు శాఖలో కడప జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టరుగా బదిలీ చేశారు.
పెద్దిరాజును స్థానంలో ముక్కంటి ఆలయ ఈవోగా ఇంకా ఎవరినీ నియమించలేదు.
కాగా పెద్దిరాజు తన హయాంలో వివాదాలకు తావులేకుండా విధులు నిర్వర్తించారు. ఆయనకు ఎలాంటి అవినీతి మచ్చలు అంటలేదు.
అయితే అధికార పార్టీల నేతల ఒత్తిడి కారణంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేక పోయారు. పెద్దిరాజు రెండేళ్ల పాటు ఇక్కడ పని చేసినా… వివాదరహితుడుగా పేరు తెచ్చుకున్నారు.

.