ప్రభుత్వ మొండి వైఖరి పై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లే వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన వారి ప్రయత్నాలు ఫలించలేదు.
శ్రీకాళహస్తి పట్టణంలో నుంచి కాకుండా పలు ప్రాంతాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం నాయకులు విజయవాడ కు చేరుకొని తమ నిరసన గళాన్ని వినిపించారు.
కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరికొందరు ఇంటి వద్దనే ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలోని పి ఆర్ టి ఎస్ రోడ్డులోని రామవరపుపాడు సెంటర్ వద్ద నెహ్రూ మార్గ్ వద్ద బైఠాయించి పిఆర్సి సాధన సమితి నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అక్కడి జీవన ఉపసంహరించుకోవాలని ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసంబద్ధమైన పదకొండవ పిఆర్సి జీవోలను వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగ, కెవిబిపురం, వరదయ్యపాలెం, ఏర్పేడు తదితర ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ముందు రోజే వారు విజయవాడ చేరుకున్నట్లు సమాచారం.
అయితే కొందరు నేతలు విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని గృహనిర్బంధం చేసి అడ్డుకున్నారు. ఇకనైనా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మానుకోవాలని ప్రజలకు వారధిగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యమంత్రి చర్చలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేయనున్నామని ఇలా భాగంగా ఈనెల 5 , 6 తేదీల్లో పెన్ డౌన్ చేయడంతోపాటు 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకులు సూర్యనారాయణ, బండి శ్రీనివాసులు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు, జిల్లా ఎన్జీవో అధ్యక్షులు రాఘవులు, రఘు పి ఎం ఆర్ ప్రభాకర్, ఏపీ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఎన్జీవో తాలూకా అధ్యక్షులు చెంచు రత్నం యాదవ్, యుటిఎఫ్ నాయకులు సూర్యప్రకాష్, శ్రీనివాసులు, దామోదరం శెట్టి, గోవిందు, వెంకటకృష్ణ, హేమ, మహేష్, ఏపిటిఎఫ్ నాయకులు మురళీకృష్ణ, దాము, చంద్ర, వెంకటాద్రి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు శ్రీనాథ్ ఎన్జీవో నాయకుడు సుబ్బారెడ్డి లతోపాటు పలువురు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు అంతేకాకుండా వీరికి అన్ని ప్రభుత్వ సంఘాల నేతలు కార్మికులు సంఘీభావాన్ని తెలిపారు.
.