ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో సందర్శించనున్న ప్రాంతాల్లో బుధవారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి తదితరులు పర్యటించారు.
ఇందులో భాగంగా రేణిగుంట మండలం, వెదల్లచెరువు ఎస్.టి కాలనీ (యానాది కాలనీ) లో బాధితులను కె. నారాయణ స్వామి, శ్రీకాళహస్తి ఎం ఎల్ ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డి కలిసి పరామర్శించారు.
వారి వెంట జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు, జె సి రెవిన్యూ రాజబాబు, ఇతర సంబంధిత అధికారులు ఉన్నారు.
ఏర్పాట్లు పకడ్బందీగా చేయండి : డిప్యూటీ సీఎం
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా శ్రీ కాళహస్తి, రేణిగుంట, తిరుపతిలో పర్యటన నేపథ్యంలో లో పక్కాగా ఏర్పాట్లు చేయాలని మంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు..
పర్యటనలో భాగంగా ఏర్పేడు మండలం పాపా నాయుడు పేట – గుడి మల్లం రోడ్డు దెబ్బతిన్న వంతెన ను పరిశీలించి, రేణిగుంట మండలం వెదల్ల చెరువు (యనాది కాలనీ) ని పరిశీలించి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారు లను ఆదేశించారు…
వీరి వెంట తిరుపతి ఆర్ డి ఓ కనక నరసా రెడ్డి, పంచా యతీ రాజ్, ఆర్ & బి, ట్రాన్స్కో ఎస్ ఈ లు అమర్నాథ్ రెడ్డి, దేవానందం, చలపతి, వ్యవ సాయ శాఖ జెడి దొరసాని, హౌసింగ్ పీడీ పద్మనాభం, డిపిఓ దశరథరామిరెడ్డి ఇతర సంబంధింత అధి కారులు కలరు.
.