ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద బీభత్సానికి ముప్పుకు గురైన పంటపొలాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరిశీలించారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పెద్ద కనపర్తి, చిన్న కనపర్తి, దైనేడు తదితర గ్రామాల్లోని పంటపొలాలు ఇసుక మేటలు తో నిండిపోవడాన్ని అలాగే వరద తాకిడికి పంటపొలాలు మునిగిపోవడం పరిశీలించారు.
అనంతరం గ్రామస్తులు మరియు అధికారులతో చర్చించి రైతులకు ఎక్కువ నష్టపరిహారం వచ్చే విధంగా చొరవ చూపాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా తెలుగు గంగ సర్వీస్ రోడ్డు వైపు ఉన్న పంట పొలాలు కూడా పరిశీలించడం జరిగింది. ఇసుక మేటల వల్ల పంట స్థలం పూర్తిగా కోతకు రావడం చాలా బాధాకరమని ఇటువంటి వర్షాలు గతంలో ఎప్పుడూ రాలేదని దీనికి తగిన విధంగా ఇరిగేషన్ అధికారులు ఆర్& బి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులు కూడా తక్షణమే దీనికి సంబంధించిన యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు ఆదేశించారు.
రైతులు నష్టపోయిన ప్రతి పైసా కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని, ఎవరు అధైర్య పడొద్దని నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి భరోసా ఇచ్చారు.
.

Discussion about this post