మాజీ గవర్నర్, మాజీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం, పెళ్లి మండపం వద్ద ఆర్యవైశ్య మిత్రులు సంతాప సభ నిర్వహించారు.
ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోశయ్య ఃదివంగత నేత వై.యస్.రాజశేఖర్ రెడ్డితో ఃఎంతో సన్నిహితంగా ఉండేవారని తెలుగు ప్రజలకు వివిధ పదవుల్లో సేవలు చేసిన నేతగా అభివర్ణించారు.
కార్యకర్త నుంచి సీఎంగా, గవర్నర్ గా ఎదిగి హుందాగా వ్యవహరిస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందారు అని కొనియాడారు.
రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్న రోశయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను అన్నారు. అలాగే రోశయ్య మృతి పట్ల మూడు రోజులపాటు సంతాప దినాలు ఏపీ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.
అనంతరం ఆర్యవైశ్య పెద్దలు మాట్లాడుతూ, ఆర్యవైశ్యులకు ఒక గుర్తింపు తెచ్చిన రోశయ్య గారు మృతి చెందడం చాలా బాధాకరమని, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు అని శ్రీకాళహస్తిలోని ఆర్యవైశ్యులకు ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి అని అన్నారు.
అలాగే ఎమ్మెల్యే మా ఆర్యవైశ్యులకు గౌరవించి రోశయ్య గారికి ఇంత భారీ ఎత్తున శ్రీకాళహస్తి నడిబొడ్డున పెళ్లి మండపం వద్ద ఈ స్థాయిలో సంతాప సభ ఏర్పాటు చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆయన మాకు ఇచ్చిన గౌరవాన్ని మరువలేనిదన్నారు.
.