చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 24వ తేదీన భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఉత్సవాలు ఏకాంతంగా జరపాలా..? లేక మామూలుగా జరపాలా అనే అంశంపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు.
వచ్చే నెల మొదటి వారంలో ముక్కంటి బ్రహ్మోత్సవాలపై కలెక్టరు సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కొవిడ్ అధికారి ఆయనే అయినందున ఆయన నిర్ణయంపై బ్రహ్మోత్పవాలు ఎలా జరపాలో నిర్ణయించనున్నారు.
బ్రహ్మోత్సవాలపై సమావేశం నిర్వహించాలని ముక్కంటి ఆలయ అధికారులు ఇటీవల చిత్తూరుకు వెళ్లి కలెక్టరును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో సమావేశం నిర్వహించడానికి కలెక్టరు అంగీకరించారు.
శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మామూలుగానే నిర్వహించుకోవడానికి అనుమతించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కూడా అదే తరహాలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అనుమతి వస్తుందని భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం నుంచి ఆలయం లోపల రంగులు వేయడానికి సిద్దమవుతున్నారు. వీటితో మిగిలిన ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేస్తున్నారు. కలెక్టరు ఉత్తర్వుల కోసం అందరూ వేచి చూస్తున్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా
ఫిబ్రవరి 24న భక్తకన్నప్ప ధ్వజారోహణం..
25న స్వామి వారి ధ్వజారోహణం..
26న రెండవ తిరునాళ్లు..
27న మూడవ తిరునాళ్లు..
28న నాలుగవ తిరునాళ్లు..
మార్చి 1న మహాశివరాత్రి, నందిసేవ, లింగోద్బవం..
2న పగలు రధోత్సవం, రాత్రి తెప్పోత్సవం..
3న శివ, పార్వతుల కల్యాణం..
4న సభాపతి కల్యాణం..
5న కైలాస గిరి ప్రదక్షిణం..
6న ధ్వజావరోహణం..
7న పల్లకీ సేవ..
8న ఏకాంతసేవ
నిర్వహించనున్నారు.
9వ తేదీ నుంచి అభిషేకం, నిత్యోత్సవం ప్రారంభం కానున్నాయి.
.

Discussion about this post