• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత : ఛైర్మన్ శ్రీనివాసులు

అందరికీ మహా లఘు దర్శనమే -ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు

admin by admin
February 17, 2023
0
సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత : ఛైర్మన్ శ్రీనివాసులు

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఈ ఏడాది అంతరాలయ దర్శనం పూర్తిగా రద్దు చేశాం. ప్రముఖులైనా… సామాన్య భక్తులైనా… అందరికీ మహాలఘు దర్శనమే. అడ్డదారి దర్శనాలకు అనుమతించం. మహాద్వారం నుంచి లోపలికి వెళ్లిన భక్తుడు 20 నిమిషాల వ్యవధిలో స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని బయటకు వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. లింగోద్భవానికి ఉచిత దర్శనం కల్పిస్తాం.

భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించడమే మా లక్ష్యం. ఇందుకు అందరూ సహకరించాలి. ఎన్నడూ లేని విధంగా ఆధ్యాత్మిక చింతన పెంచే విధంగా ఈ ఏడాది ధూర్జటి కళాప్రాంగణంలో సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం’’ అంటున్నారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై బుధవారం ఆయన ‘ఆదర్శిని’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

? మహాశివరాత్రి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి

మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంజనీరింగ్ శాఖ పనులు అన్నీ పూర్తి చేశారు. విద్యుత్ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా చేశాం. పండుగ రోజున భక్తులను ఆకట్టుకునే విధంగా పుష్పాలంకరణ చేస్తాం.

? దర్శన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు

మహాశివరాత్రి రోజున ఉచిత దర్శనం కోసం రాజగోపురం సమీపంలోని పాత ఎస్ బీఐ వద్ద నుంచి క్యూలైను ఏర్పాటు చేస్తున్నాం. ప్రముఖులను సుపథ మండపం మార్గంలో అనుమతిస్తాం. రూ.500 ప్రత్యేక దర్శనం టికెట్టు తీసుకునే వారికి కూడా ఇదే మార్గంలో పంపుతాం. పండుగ రోజున తిరుమంజన గోపురం మార్గం మూయాలని నిర్ణయించాం. మిగిలిన మూడు మార్గాల్లో యథావిధిగా భక్తులను అనుమతిస్తాం. దర్శనం తరువాత మృత్యుంజయ స్వామి సమీపం నుంచి భక్తులు బయటకు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు ఆలయం పై భాగాన వెళ్లవచ్చు. లేదా కంచుగడప ద్వారా కూడా బయటకు వెళ్లవచ్చు. క్యూలైన్లతో భక్తులు ఇబ్బందులు పడకుండా తాగునీరు, మజ్జిగ, పసిపిల్లలకు పాలు అందుబాటులో ఉంచుతాం.

? దర్శనాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తారా

తప్పకుండా ఇస్తాం. స్థానికుల కోసం రూ.500 టికెట్టును రూ.200 ఇస్తున్నాం. ఇందుకు మొదట దేవదాయశాఖ కమిషనరు అనుమతి ఇవ్వలేదు. ధర్మకర్తల మండలి జోక్యం చేసుకుని ఆయనను ఒప్పించాం. ఈ టికెట్లను పండుగకు మూడు రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంచుతాం. టికెట్లు రొటేషన్ కాకుండా స్కానింగ్ చేసి పంపుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

? ప్రముఖుల దర్శనానికి ప్రత్యేక సమయం కేటాయిస్తారా

అలాంటిదేమీ లేదు. ప్రత్యేక సమయం కేటాయించాలని మొదట అనుకున్నాం, అయితే ఆ నిర్ణయం మళ్లీ ఉపసంహరించుకున్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల నేతలకు ఎలాంటి స్వాగతాలు, ఆశీర్వచనాలు ఉండవు. ప్రభుత్వ అధికారులకు మాత్రం మినహాయింపు ఉంది.

? ఉత్సవాల నిర్వహణ బడ్జెట్ ఎంత

దేవదాయశాఖ ఉన్నతాధికారులు రూ.4 కోట్లు బడ్జెట్టు కేటాయించారు. ఈ నిధులతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కనీస వసతుల కల్పనతో పాటు విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణ తదితర ఏర్పాట్లు చేస్తున్నాం.

? మహాశివరాత్రి రోజున భక్తుల రద్దీని ఎలా నియంత్రిస్తారు

ఈ ఏడాది మహాశివరాత్రి రోజున లక్ష నుంచి లక్షన్నర మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి తగ్గట్లుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ సంతృప్తికర దర్శనం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశాం.

? భక్తులకు ఎలాంటి వసతులు కల్పించారు

ప్రత్యేకంగా స్నానపు గదులు, మరుగుదొడ్లు ఇప్పటికే చేయించాం. భక్తుల కోసం ఇప్పటి వరకు శాశ్వత ప్రాతిపదికన 80 మరుగుదొడ్లు నిర్మించాం. పండుగ రోజున 150 సంచార మరుగుదొడ్లు అందుబాటులో ఉంచుతాం. భక్తులు బస చేసేందుకు వీలుగా కారిడార్ల నిర్మాణాలు పూర్తి చేశాం. శుద్ధి చేసిన తాగునీరు, క్యూలైన్లలో నిరీక్షించే భక్తులకు వసతులు సిద్ధం చేస్తున్నాం.

? ఈ బ్రహ్మో త్సవాల్లో ప్రత్యేక ఏమిటి..?

అందరి సహకారంతో ఉత్సవర్లకు ప్రత్యేక అలంకరణలు చేపట్టదలిచాం. ఊరేగింపు నిర్ణీత సమయానికి ఉంటుంది. జమీందార్ల కాలం నాటి దివ్యాభరణాలతో స్వామి అమ్మవార్లను అలంకరిస్తాం. ఫల, పుష్పాలతో భక్తులను ఆకట్టుకునే విధంగా ప్రత్యేక రీతిలో అలంకరణలు చేస్తాం.

? ఏయే రోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపడతారు

మహాశివరాత్రితో పాటు లింగోద్భవం, రథోత్సవం, తెప్పోత్సవం, శివ పార్వతుల కల్యాణోత్సవం, కైలాసగిరి ప్రదక్షిణోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం.

? సాంస్కృతిక కార్యక్రమాల ప్రత్యేకత

ఆధ్యాత్మిక చింతన పెంచే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఎక్కువగా నృత్య ప్రదర్శనలు, ఆహుతులను ఆకట్టుకునే పౌరాణిక నాటకాలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవ చనాలు తదితర వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.

? ప్రసాదాల తయారీలో ప్రణాళికలు ఏ విధంగా సిద్ధం చేశారు

భక్తులకు ప్రసాదాల కొరత రానీయకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధం చేశాం. రోజువారీగా అవసరమైన మేరకు అందుబాటులో ఉంచడంతో పాటు… మహాశివరాత్రి రోజున లక్షన్నర మేరకు లడ్డూలు, వడలు, పులిహోర, జిలేబీ తదితర ప్రసాదాలు అందుబాటులో ఉంచుతున్నాం.

Tags: anjuru srinivasulumahasivaratrisirkalahastisivaratri brahmotsavamskht templesrikalahasti templeఅంజూరు శ్రీనివాసులుమహాశివరాత్రిశివరాత్రి ఉత్సవాలుశ్రీకాళహస్తీశ్వరాలయం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply