శ్రీకాళహస్తీశ్వరుని ఆలయ ఆదాయం పెరిగింది. గతంలో హుండీ లెక్కింపుతో పోలిస్తే అధికాదాయం వచ్చింది.
డిసెంబరు నెలలో కేవలం 18 రోజుల వ్యవధిలో సుమారు కోటి రూపాయల ఆదాయం రావడం విశేషం.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయ హుండీ ఆదాయం రూ.96,96,652 వచ్చింది.
ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు పర్యవేక్షణలో బుధవారం హుండీ ఆదాయం లెక్కించారు.
ప్రధాన హుండీలతో పాటు, పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా వచ్చిన అన్నీ కలిపి లెక్కించారు.
మొత్తం 78.5 గ్రాముల బంగారం, 318.1 కిలోల వెండి… విదేశీ కరెన్సీ 40 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ ఆదాయం వచ్చినట్లు వారు చెప్పారు. సాధారణంగా సరాసరి 70 లక్షలకు తక్కువ కాకుండా హుండీ ఆదాయం వస్తుంటుంది.
.