విద్యార్థులు ఉన్నతాశయంతో చదవాలని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతాంగళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి అన్నారు.
శ్రీకాళహస్తి మండలం తొండమనాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆయన పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఒక ఆశయం ఏర్పరచుకుని… క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. దీంతో తమ తల్లిదండ్రలతో పాటు.. జన్మనిచ్చిన ఊరికి, పాఠశాలకు మంచి పేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పదవ తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన వారికి రూ.5వేలు బహుమతిగా అందజేస్తానని బాలాజీ ప్రసాద్ రెడ్డి చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ బహుమతి ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాధి, బీసీ సంఘం నేత సురేంద్ర ముదిరాజ్, మునిక్రిష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం, సత్యయాదవ్, వెంకటమునితో పాటు బీసీ సంఘం నేతలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
.