శ్రీకాళహస్తి. దిశ రక్షణ ఫౌండేషన్ స్పోక్ పర్సన్ జిల్లా అధ్యక్షురాలిగా ఏపీ బి సి బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గులాబీ ఈశ్వర్ సునీతాసింగ్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి రాష్ట్ర హోమ్ మినిస్టర్ సుచరిత చేతుల మీదగా ఆమె ఐడీ కార్డులో అందుకున్నారు.
సభ్యులు ఆమెకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు సలహాలు అందజేశారు.
గ్రామాలలో పాఠశాలలు కళాశాలలో బాలికలు యువతులు మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం స్త్రీల రక్షణకు తీసుకుంటున్న చర్యలు ఫౌండేషన్ ద్వారా తెలియజేయాలన్నారు.
అనంతరం శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్‌రెడ్డి కి హోం మినిస్టర్ సుచరిత కు కృతజ్ఞతలు చేశారు.
ఈ సందర్భంగా గులాబీ సునీత సింగ్ మాట్లాడుతూ మహిళ రక్షణ కు తన వంతు సహకారం ఫౌండేషన్ ద్వారా ద్వారా అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రెటరీ అరుణ తదితరులు పాల్గొన్నారు
.