చెన్నైకి చెందిన శ్రీమతి సరోజ సూర్యనారాయణన్(85) అనే భక్తురాలు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి గురువారం సాయంత్రం స్వర్ణ యజ్ఞోపవీతం, కాసుల హారం కానుకగా అందించారు.
ఆలయంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి ఈ ఆభరణాలను అందజేశారు. వజ్రాలు పొదిగిన ఈ స్వర్ణ యజ్ఞోపవీతం, కాసులహారం బరువు దాదాపు 4.150 కిలోలు కాగా, వీటి విలువ సుమారు రూ.2.45 కోట్లు.
ఈ కార్యక్రమంలో ఈ ఆభరణాలు తయారు చేసిన అభిరామి జ్యువెల్స్‌కు చెందిన శ్రీ మాధవన్ పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
.