పెట్రో ఉత్పత్తులపై ధరలు వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండు చేశారు. శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేటలో గల పెట్రోలు బంకు వద్ద బుధవారం వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ… డీజిల్, పెట్రోలు ధరలు తరచూ పెంచుతున్నందున నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి పెరిగి పోతున్నాయన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలు నిత్యం పెరుగుతున్నందున సామాన్యుని పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సామాన్యులు పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేసే స్థితిలో లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రో ఉత్పత్తులపై సుంకం తగ్గించడం వలన కొంత మేర ధరలు తగ్గాయన్నారు. అయితే రాష్ట్రం మాత్రం తన వాటా పన్ను తగ్గించక పోవడం బాధాకరమన్నారు. పెట్రో ఉత్పత్తులకు సంబంధించి రాష్ట్రం పన్ను తగ్గిస్తే ధర తగ్గుతుందని వారు చెప్పారు. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చుకుంటే లీటరుపై రూ.10కి పైగా ఇక్కడ ధర అధికంగా ఉందన్నారు. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై తన వాటా సుంకం తగ్గించాలని డిమాండు చేశారు. లేదంటే టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు విజయకుమార్. గుమ్మడిపూడి దశరథాచారి, రెడ్డివారి గురవారెడ్డి, చక్రాల ఉష. షాకీరాలీ, ప్రకాశ్ నాయుడు, జిలానీ బాషా, నెమళ్లూరు బుజ్జి, మిన్నల రవి, ప్రసాద్ రావు, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, అస్మత్, బషీర్, మస్తాన్, గోపి, మునిరాజా యాదవ్, యాదగిరి, మణి, ఆర్మగం, శ్రీలక్ష్మి, రామచంద్రయ్య, కోబాక లక్ష్మణ్, లక్ష్మీనారాయణ గుప్తా, రమేష్, సులీమా, క్రిష్ణవేణి. సుమతి, దుర్గ, త్రివేణి, సుజాత, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
.