పంచెకట్టులో నిలువెత్తు తెలుగుదనపు సంతకం
పంచ్ వేయడంలో.. తిరుగులేని చతురత ఆయన సొంతం
కార్యదక్షతలో నిత్య జనహితైషి..
ప్రసంగ కుశలతలో సదా సత్యాన్వేషి..
‘‘మాతృభాష కళ్లు అయితే
పరాయి భాష కళ్లజోడు’’
అనేది వెంకయ్య గారి ఉవాచ..
నిత్యానుష్ఠానంగా మనందరం పాటించాలి మనసా వాచా!
తెలుగుజాతి గర్వ పతాకగా..
తెలుగు రీతికి సర్వ ప్రతీకగా..
భరతమాత ముద్దుబిడ్డడిగా..
అధిష్టించిన అత్యున్నత పదవికి మటుకే విరామం..
ఆ సేవానిరతికి జాతి సదా చేస్తుంది ప్రణామం..
వారి గళం.. అమేయం, అనర్గళం
వారి పయనం.. విరామమెరుగని ప్రస్థానం
ఆయన ఓ అసమాన శిఖరం!
ప్రజాజీవితంలో సరికొత్త శిఖరాలు..
నిరీక్షిస్తున్నాయి ఆయన తర్వాతి అడుగు కోసం!!
ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు
భారత ఉపరాష్ట్రపతిగా
పదవీవిరమణ చేస్తున్న సందర్భంగా..
హార్దిక శుభాకాంక్షలు..
మనఃపూర్వక ప్రణామాలు.
..ఎం.ఎల్.ఎన్.మూర్తి
.

Discussion about this post