పదేళ్లు దేశ ప్రధానిగా పనిచేసిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మనసు గాయపడ్డ వేళ తన పదవికి రాజీనామా చేయాలని అనుకున్నారనే వార్త సోమవారం దేశ రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. దేశ రాజకీయాలలో ఇదే అంశం హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేయడానికి బీజేపీకి మరో ఆయుధం దొరికినట్లు అయ్యింది. ఇందుకు మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా రాసిన పుస్తకంలోని అంశాలు కారణం అయ్యాయి.
కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉండగా 2013లో సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు ఇస్తూ రాజకీయాల్లో తీవ్ర నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచే విధంగా పేర్కొంది. అయితే రాజకీయ కారణాలతో కేసులు నమోదు చేయడం పరిపాటి అయినందున దీనిపై యుపిఏ ప్రభుత్వం అప్పట్లో ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ కాపీలను న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ చించేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలో ఉన్నారు.
ప్రధాని విదేశీ ఈ పర్యటనలో ఉండగా అధికార పార్టీ ఎంపీ అయినా రాహుల్ గాంధీ ఈ విధంగా చేయడం పై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. యూపీఏ చైర్‌పర్సన్ అయిన సోనియా గాంధీకి తెలియకుండా ఆర్డినెన్స్ వచ్చే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో మనసు నొచ్చుకున్న మన్మోహన్ సింగ్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అనుకున్నారు. ఇదే విషయమై తన మిత్రుడు, అప్పటి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అయిన మాంటెక్ సింగ్ అహ్లువాలియాను, మన్మోహన్ సింగ్ సలహా అడిగారు. దీనిపై మాంటెక్ సింగ్ స్పందిస్తూ రాజీనామా చేయవద్దని సూచించారు. ఈ విషయం మాంటెక్సింగ్ అహ్లువాలియా రాసిన backstage: the story behind India’s high growth years పుస్తకంలో ప్రస్తావించారు. ఈ అంశం సోమవారం వెలుగులోకి రావడంతో దేశ రాజకీయాల్లో లో హాట్ టాపిక్ గా మారింది.
పదేళ్ల సుదీర్ఘ కాలం భారతదేశానికి ప్రధానిగా పనిచేసినప్పటికీ.. మన్మోహన్ సింగ్ మౌనమునిగా పేరుపడ్డారు. అంతర్గత రాజకీయాలకు పేరుమోసిన కాంగ్రెసు పార్టీలో నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా.. అత్యధికకాలం ప్రధానిగా చేసిన వ్యక్తి ఆయన. ప్రధానిగా ఆయన ఉన్నప్పటికీ.. ప్రభుత్వాన్ని తెరవెనుక నుంచి నడిపించే ‘కీ’ మాత్రం యూపీఏ ఛైర్ పర్సన్ హోదాలో సోనియా చేతుల్లో ఉండేదని అంతా అనుకునేవాళ్లు. ఆ పదేళ్లలో మన్మోహన్ అనేక రకాలుగా ఒత్తిడికి గురైనట్లు వేర్వేరు సందర్భాల్లో.. అప్పటి పెద్దలు రాసిన పుస్తకాల ద్వారా తెలుస్తుంది. రాహుల్ అనాలోచిత దుడుకు చర్య వలన… ఆయన ఏకంగా రాజీనామాకే సిద్ధపడ్డారనే సంగతి ఇప్పుడు బయటకు వచ్చింది.
.
Discussion about this post