సాధారణంగా.. ఒక ఊరికి నలువైపులా నీళ్లు వెల్లువలా వచ్చేసి.. ఆ ఊరికి ఇతర ప్రాంతాల్తో రాకపోకలు కూడా లేకుండా స్తంభించిపోతే.. దాన్ని జలదిగ్బంధనం అంటాం.
ఏడుకొండల మీద ఎంతో ఎత్తులో ఉండే తిరుమల జలదిగ్బంధనంలో ఎలా ఉంటుంది. ఉండగలుగుతుంది? అనే సందేహం కలుగుతోంది కద.. అయినా ఇది నిజమే.
భారీ వర్షాల కారణంగా.. తిరుమలకు ఇతర ప్రాంతాలతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. భారీ వర్షాలు బీభత్సంగా కురుస్తుండడంతో.. తిరుమలకు వచ్చే, వెళ్లే రెండు ఘాట్ రోడ్డులను కూడా అధికారులు మూసివేశారు.
అలిపిరి , శ్రీవారి మెట్టు రెండు నడక దారులను కూడా మూసివేశారు. దీంతో తిరుమలకు ఇంతర ప్రాంతాలతో రవాణా సదుపాయాలు పూర్తిగా కట్ అయిపోయాయి.
ఇటీవలి వర్షాలకు కూడా రాత్రి నుంచి ఉదయం వరకు ఘాట్ రోడ్డులను, నడక దారులను మూసివేసిన సంగతి అందరికీ తెలుసు. అయితే.. గురువారం నాడు వర్షబీభత్సం ఇంకా ఎక్కువగా ఉండడంతో.. దారుల మూసివేత ఎప్పటిదాకా ఉంటుందనేది కూడా అధికారులు ప్రకటించలేదు. శుక్రవారం కూడా వర్షం తగ్గితే తప్ప రాకపోకలను పునరుద్ధరించే పరిస్థితి లేదు.
.
Discussion about this post