గ్యాంగ్‌స్టర్ నయీమ్ పేరు తెలుగురాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. కరడుగట్టిన నేరగాడిగా, భూకబ్జాలు, కిరాయిహత్యలు, మహిళల అక్రమ రవాణా, కిడ్నాపులు ఇలాంటి సకల అరాచక కార్యకలాపాలు ప్రధాన వ్యాపకం, వ్యాపారంగా కలిగిన వ్యక్తిగా నయీమ్ అంటే పేరు. ఇది ఒక పార్శ్వం.
నయీమ్.. కరాటే నేర్చుకున్నవాడు. అతివాద భావజాలంతో నక్సలైట్లలోకి వెళ్లాడు. నక్సలైటుగా సుదీర్ఘ జైలుజీవితం అనుభవించాడు. తర్వాత బయటకు వచ్చి నక్సలైట్ల మీదనే పగబట్టి వారిని అంతమొందించే ప్రయత్నంలో పడ్డాడు. ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తాడు. ఇది రెండో పార్శ్వం
మొత్తానికి.. ఇలాంటి భిన్నకోణాలు ఉండే నయీమ్ జీవితాన్ని కథాంశంగా తీసుకుని సినిమా చేయడం సాహసమే. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం చేస్తానని ప్రకటించాడు. అయితే.. తర్వాత విరమించుకున్నాడు. వర్మ కోసం కథ రూపొందించిన దామూ బాలాజీ తన దర్శకత్వంలోనే దీనిని తెరకెక్కించారు. ఇది నేపథ్యం.
తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయింది. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎంతో కొంత కాంట్రడిక్షన్ ఉంది. ఆ కాంట్రడిక్షన్ మోతాదు ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటే.. దానికి తగ్గట్టుగా ఆ వ్యక్తి జీవితం అతలాకుతలం అవుతూ ఉంటుంది. ఆ కోణంలోంచి చూసినప్పుడు.. నయీమ్ జీవితంలో కూడా చాలా చాలా కాంట్రడిక్షన్ ఉంది. దర్శకుడు ఆ కాంట్రడిక్షన్ సరిగ్గానే పట్టుకున్నాడనే సంగతి ఈ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది.
‘ఐ హేట్ పోలీస్’ అని కథానాయకుడు ఒకచోట చెబితే.. రెండు నిమిషాల ట్రైలర్ ముగిసేలోగా, ‘పార్టీ అంటే కన్నతల్లికన్నా ఎక్కువ అన్నా’ అంటూ నక్సలిజంలోకి ప్రవేశించినవాడు కాస్తా.. మరో సందర్భంలో ‘ఐ హేట్ నక్సలైట్స్’ అని ప్రకటించేస్తాడు.
ఇవి కూడా చదవండి :
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
‘పునరుత్థానం చరిత్ర వీరులకిచ్చే వరం.. నువ్వు నడుస్తున్న చరిత్రవి’ అంటూ ఒక పాత్ర కితాబులివ్వడాన్ని చూసి, అది నయీమ్ గురించే అని అర్థం చేసుకునేలోగా.. ‘ద్రోహుల రక్తంతో విప్లవం ఎరుపెక్కుతుంది’ అంటూ అదే పాత్ర నయీమ్ ను ఈసడించే సన్నివేశమూ కనిపిస్తుంది.
ఈ రకంగా నయీమ్ జీవితంలోని కాంట్రడిక్షన్స్ ఈ ట్రైలర్ మనకు కనిపిస్తాయి. సినిమా మీద ఆసక్తిని పెంచుతాయి. ఒక వ్యక్తి జీవితంలో ఉండగల కాంట్రడిక్షన్స్ కి నయీమ్ జీవితం ఒక నిదర్శనం. ఆ విషయం ఈ ట్రైలర్ లోనే బాగా కనిపిస్తుంది.
‘బతికేవాడికి భయముంటాదేమో గానీ.. పోరాడే వాడికి ఉండదు’ అనే డైలాగు ద్వారా.. నయీమ్ ప్రతిదశలోనూ తెగించే వ్యవహరించేవాడనే సంగతి తెలుస్తుంది. మొత్తానికి ఈ రెండు నిమిషాల ట్రైలర్ గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితం గురించి- అతని ఎన్‌కౌంటర్ తర్వాత పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వచ్చిన కథనాలను మించి.. ఆ జీవితంలో మనకు ఆసక్తికరమైన అంశాలేవో ఉన్నాయని, సినిమా చూడాలనే ఆసక్తిని కలిగిస్తుంది. తెలంగాణ ప్రధాన నాయకుడిని గుర్తుకు తెచ్చే పాత్ర, విప్లవ పోరాట గాయకుడిని గుర్తుకు తెచ్చే పాత్ర కనిపిస్తాయి.
వశిష్ట సింహా అనే కన్నడ హీరో నయీమ్ పాత్రను పోషించిన ఈ చిత్రానికి వరదరాజు నిర్మాత. అరుణ్ ప్రభాకర్ సంగీతం అందించారు. సురేష్ భార్గవ కెమెరా పనితనం అడవులలో బాగా తెలుస్తుంది.
‘‘రాజ్యం- అనే అతిపెద్ద రాక్షసుడు సృష్టించి పెంచి పోషించి నాశనం చేసేసిన చిన్న రాక్షసుడు నయీమ్’’ అనే సందేశం బహుశా ఈ సినిమా ఆత్మ ఏమిటో సంక్షిప్తంగా చెప్పే వాక్యం.
చాలా భావతీవ్రత ఉన్న ఈ వాక్యాన్ని ఇంత నిర్మొహమాటంగా స్పష్టంగా సూటిగా చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ప్రభుత్వం మీద సూటిగా చేసే విమర్శ ఇది.
ALSO READ
చిరు చెల్లెలిగా ఆమె తప్ప మరో ఆప్షన్ లేదు
అమరావతి మహాపాదయాత్రలోకి జనసేనాని పవన్ కల్యాణ్
కుప్పంలో వార్డుల వారీగా వైసీపీ మెజారిటీలు ఇవే!
ఆ విమర్శను సాధికారంగా చేయాలంటే తెగింపు కూడా ఉండాలి. కథ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించిన దామూ బాలాజీ కి ఆ తెగింపు ఉందని కనిపిస్తుంది. బహుశా స్వయంగా నక్సలైట్లలో పనిచేసి, నక్సలైటుగా జైలుశిక్షలను కూడా అనుభవించి తర్వాత పౌరజీవనంలోకి వచ్చిన రచయిత కావడం వల్లనే దామూ బాలాజీకి ఆ తెగింపు అలవడి ఉంటుంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.

Discussion about this post