తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సజీవ సమాధి అయిన బృందావనం ప్రాంతాన్ని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శనివారం అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
వెంగమాంబ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఈవో మాట్లాడుతూ 19వ శతాబ్దానికి చెందిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన సాహిత్యం ద్వారా శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేశారని చెప్పారు.
వెంగమాంబ బృందావనాన్ని 1.5 ఎకరాల్లో భక్తుల సందర్శనీయ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఈవో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్ అధికారి శ్రీ మల్లికార్జున, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు ఉన్నారు.
.

Discussion about this post