ఒక్కసారి వాడి పడే సే ప్లాస్టిక్ తో మానవాళి మనుగడకు పెను ప్రమాదం పొంచి ఉందని భారత ప్రభుత్వ నీతి అయోగ్ ప్రత్యేక కార్యదర్శి డా.కె. రాజేశ్వర రావు (ఐఏఎస్) పేర్కొన్నారు.
శుక్రవారం తిరుపతి హోటల్ గ్రాండ్ రిడ్జ్ లో యు.ఎన్.డీ.పీ ( యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం)- నీతి అయోగ్ సంయుక్త ఆధ్వర్యంలో అర్బన్ ప్లాస్టిక్ వేస్ట్ మేనే జ్మెంట్ పై 2వ రీజినల్ స్థాయి (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి) వర్క్ షాప్ జరిగింది.
ఈ సందర్భంగా వర్క్ షాప్ లో భాగంగా నీతి అయోగ్ ప్రత్యేక కార్యదర్శి డా.కె. రాజేశ్వర రావు (ఐఏఎస్) వారు మాట్లాడుతూ… ప్లాస్టిక్ తో మానవాళి మనుగడకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొవడానికి పట్టణ స్థానిక సంస్థలు, కాలుష్య నియంత్రణ బోర్డులు, రాష్ట్ర పట్టణ అభివృద్ధి సంస్థలు సమన్వయంతో సమిష్టిగా, సమర్థవంతంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చేపట్టాల్సి ఉందన్నారు. భారత ప్రభుత్వ స్వచ్ఛ భారత్ 2.0ని అమలు చేయడంలో పట్టణ స్థానిక సంస్థలు కీలక భాగస్వామ్యం కావాలన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆచరణాత్మక పరిష్కారాలతో పట్టణ స్థానిక సంస్థలకు మద్దతివ్వడానికి నీతి అయోగ్ కట్టుబడి ఉందని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణల, వ్యర్ధాలను పారద్రోలే ఆచరణాత్మక కార్యక్రమా ల్లో పట్టణ స్థానిక సంస్థలు మరింత మెరుగైన పాత్ర పోషించాలన్నారు.
అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, సరి కొత్త ఆలోచనలతో ప్లాస్టిక్ నియంత్రణ చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని అభివృద్ధి చేయడం, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను వినియోగించ కుండా చేయడం, సంప్రదాయక(క్లాత్ &జూట్) బ్యాగులను వాడేలా ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించాలన్నారు.
వర్క్ షాప్ లో యుఎన్డీపీ ప్రోగ్రాం మేనేజర్ శ్రీకృష్ణ బాలచంద్రన్, ప్రోగ్రాం హెడ్ సలోని గోయల్ ముఖ్య ప్రసంగం చేశారు.
గ్రేటర్ చెన్నై , మదురై కార్పొరేషన్ లు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అంశాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగా చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో వ్యర్ధాలను వేరుగా సేకరించడం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అంశాలపై కమిషనర్ పి.విశ్వనాథ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల పరిధిలోని చిత్తూరు, తిరుపతి, గుంటూరు, కాకినాడ, శ్రీకాళహస్తి, చెన్నై, మధురై కార్పొరేషన్ల కమిషనర్లు, ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, గ్రామాలయ స్వచ్ఛంద సంస్థ (తమిళనాడు) ప్రజెంటేషన్ లను వర్క్ షాప్ లో వివరించాయి.
చిత్తూరు, మధురై కార్పొరేషన్ల ప్రజెంటేషన్లు ఆకట్టుకొనేలా ఉండడంతో యుఎన్డిపి తో కలిసి పని చేసేందుకు ఆహ్వానించారు.
ఈ వర్క్ షాప్ కు గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ అనురాధ, తిరుపతి నగరపాలక డిప్యూటీ కమిషనర్ చంధ్రమౌళిశ్వర రెడ్డి, చిత్తూరు పురపాలక సంఘం మాజీ చైర్మన్ చెంగల్రాయ నాయుడు, యుఎన్డీపీ సీనియర్ ప్రాజెక్ట్ అధికారి ప్రశాంత్ లింగం, వివిధ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
.

Discussion about this post