• About Us
  • Contact Us
  • Our Team
Sunday, September 20, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

రాజమౌళిపై టాలీవుడ్ మూకుమ్మడి యుద్ధం!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నివురుగప్పిన నిప్పు రగులుతోంది. ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ విషయంలో కొత్త తకరారు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. టాలీవుడ్ దిగ్గజ నిర్మాతలు, దర్శకులు.. రాజమౌళికి వ్యతిరేకంగా అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

admin by admin
April 1, 2021
0
rajamouli changes release date of RRR

రాజమౌళి దర్శకత్వంలో- ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) విడుదల తేదీ మారబోతోందా? ఇదివరకు ప్రకటించిన తేదీకి కాకుండా.. దర్శకుడు రాజమౌళి మరో ముహూర్తాన్ని ఎంచుకున్నారా? ఆ కొత్త ముహూర్తమే.. ఆయన మీద తెలుగు సినీ పరిశ్రమ యుద్ధం ప్రకటించడానికి సన్నద్ధం అయ్యేలా పురిగొల్పుతోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. విడుదలకు కొత్త ముహూర్తం అనేది నిజమే అయితే గనుక.. ఈ వివాదం పెద్ద దుమారాన్నే సృష్టించే అవకాశం ఉంది.

ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ఈ ఏడాది అక్టోబరు 13 ను విడుదల తేదీగా రాజమౌళి గతంలో ప్రకటించారు. ఇప్పటికే రెండున్నరేళ్లుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మొట్టమొదటగా 2018 నవంబరు 19న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. అల్యూమినియం ఫ్యాక్టరీలో, వడోదరలో, బల్గేరియాలో చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు షూట్ చేశారు. కొవిడ్ దెబ్బకు షూటింగ్ ఆగిపోయిన తర్వాత.. అక్టోబరు 5 న తిరిగి షూటింగ్ ప్రారంభించారు. మొత్తానికి 2021 అక్టోబరు 13ను విడుదల తేదీగా ప్రకటించారు. మొత్తం 350-400 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

JR NTR as Komaram Bheem in SS Rajamouli's 'RRR' trends online, fans hail #RamarajuForBheem - Watch

ఆ తేదీకి రావడం లేదు..

అయితే తాజాగా విడుదల తేదీని మార్చడానికి రాజమౌళి డిసైడైనట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబరు 13న విడుదల చేయలేమని, ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి అనుకుంటున్నట్లు సమాచారం. విడుదల తేదీని వాయిదా వేయాలని ఎందుకు అనుకుంటున్నారనే సంగతి మాత్రం బయటకు రాలేదు. పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ మీద భారీగా ఆధారపడుతున్న రాజమౌళి.. అందుకు ప్రస్తుతం అనుకుంటున్న సమయం సరిపోదనే భావనతో ఉన్నారో.. లేదా షూటింగ్ కూడా ఇంకా ఆలస్యం కావచ్చునని అనుకుంటున్నారో తెలియదు. అక్టోబరు నాటికి కొవిడ్ అనంతర పరిస్థితులు, థియేటర్ లలో సినిమాలు చూసే వాతావరణం పూర్వపు స్థాయికి చేరుకోవచ్చుననే అంతా భావిస్తున్నారు. రాజమౌళి విడుదలను అప్పటికి ప్లాన్ చేసుకోవడం వెనుక ఇది కూడా ఒక కారణం. ఇప్పటికే వేక్సినేషన్ మొదలైన నేపథ్యంలో అక్టోబరు నాటికి అంతా కుదురుకుంటుందనే అనుకుంటున్నారు. అయినప్పటికీ.. అక్టోబరు 13న కాకుండా, సంక్రాంతికి విడుదల చేయాలని రాజమౌళి అనుకోవడం ఏమిటో అంతుచిక్కడం లేదు. సరిగ్గా ఆ నిర్ణయమే పరిశ్రమలో అనేకమంది పెద్దలు యుద్ధం ప్రకటించడానికి దారితీసింది.

నివురుగప్పిన నిప్పులా..

ఈ నిర్ణయం బయటకు లీక్ కావడంతోనే టాలీవుడ్ లో సంచలనం రేగింది. డిసెంబరు మాసాంతానికి, సంక్రాంతి నాటికి తమ తమ సినిమాల విడుదలలు ప్లాన్ చేసుకున్న నిర్మాతలు అందరూ మండిపడుతున్నారు. రాజమౌళి చిత్రం అక్టోబరు 13న విడుదల ప్రకటించారు గనుక.. రెండు నెలల గ్యాప్ తో డిసెంబరు నెలాఖరు నాటికి, సంక్రాంతి నాటికి అనేక పెద్ద సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్- క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాతో పాటు, మహేష్ హీరోగా తయారవుతున్న సర్కారువారి పాట చిత్రం కూడా 2022 సంక్రాంతికి విడుదల అవుతాయని తేదీని ప్రకటించేశారు. కాగా.. నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో చిత్రం త్వరగా రూపొందితే.. దాన్ని కూడా బాలయ్యకు కలిసొచ్చే సంక్రాంతి నాటికే విడుదల చేస్తారనే పుకారు కూడా ఉంది.

Ram Charan, Alia Bhatt, Ajay Devgn starrer RRR to be postponed to the summer of 2021? | Celebrities News – India TV

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రహీరోల చిత్రాల మధ్య విడుదల తేదీల క్లాష్ రాకుండా ఉండడానికి ఒక అప్రకటిత ఒప్పదాన్ని పాటిస్తూ ఉంటారు. ఒకేసారి అనేక చిత్రాలు పడ్డట్లయితే.. మొత్తంగా పరిశ్రమే నష్టపోతుందనే ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటును అనుసరిస్తున్నారు. రాజమౌళి తన భారీచిత్రం అక్టోబరు 13న వస్తుందని ప్రకటించడం వల్ల వీరంతా సంక్రాంతి నాటికి తమతమ సినిమాలు షెడ్యూలు చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు రాజమౌళి కూడా సంక్రాంతి నాటికి రావాలని ప్లాన్ చేస్తుండడం వివాదాస్పదం అవుతోంది.

నాకేం తెలియదంటున్న నిర్మాత

ఇలా విడుదల తేదీని మార్చడం సరికాదని కొందరు పరిశ్రమ పెద్దలు నిర్మాత దానయ్యను సంప్రదించినప్పుడు.. తనకేం తెలియదని ఆయన అన్నట్లుగా కూడా వినిపిస్తోంది. డబ్బులు పెట్టడం వరకే తాను చూస్తున్నానని, విడుదల తేదీ లాంటి వ్యవహారాలన్నీ రాజమౌళి కొడుకు చూసుకుంటున్నాడని ఆయన అన్నట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కూడా రాజమౌళి మీద పరిశ్రమ పెద్దలు పలువురు ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమౌతున్నట్లు సమాచారం.

అంతగా ఉంటే వేసవికి వెళ్లొచ్చు..

రాజమౌళి మీద ఈ అప్రకటితయుద్ధం నివురుగప్పిన నిప్పులా పరిశ్రమలో అలుముకుంటోంది. టాలీవుడ్ పెద్దలు తమలో తాము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారే తప్ప.. బయటపడడం లేదు. రాజమౌళి విడుదల తేదీ మార్పును అధికారికంగా ప్రకటిస్తే మాత్రం వీరి ఆగ్రహం బద్ధలయ్యే అవకాశం ఉంది.

రాజమౌళి తాను ముందుగా ప్రకటించినట్లుగా అక్టోబరు 13నాడే విడుదల చేయాలని, లేకపోతే.. సంక్రాంతి సీజన్‌ను వదిలేసి.. 2022 వేసవి కానుకగా తన సినిమాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ప్రభాస్ చిత్రం విడుదల కాబోతోంది. వేసవికి రాజమౌళి సినిమాను ప్లాన్ చేసినా.. ఇంకో తగాదా అవొచ్చు. కానీ.. సంక్రాంతికి విడుదల చేస్తానంటే మాత్రం ఒప్పుకునేది లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇండస్ట్రీలో అవాంఛనీయ పోటీకి, అవాంఛనీయ వాతావరణానికి దారితీస్తుందని కూడా పలువురు అంటున్నారు.

https://www.youtube.com/watch?v=6SDr6OZB10s

Tags: ajay devaganalia bhattalluri seetaramarajucherrydirector rajamoulidvv danayyaJr NTRkeeravanikomaram bheemntroctober 13 2021rajamouliramcharanRRR on october 13RRR release date
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply