అరవింద సమేత చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ అంటేనే డైలాగులు. అలాంటిది ఈ సినిమాలో పెద్దగా డైలాగులు ఉండవని అంటున్నారు. అంటే.. ఈ సినిమాకు త్రివిక్రమ్ సరిగా పనిచేయలేదా? అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్టీఆర్ అంటేనే ఎనర్జీ, డైలాగ్స్, డాన్స్. ఈ మూడింటికి ఇంటిపేరు తారక్. ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్ డైలాగులు బాణాల్లా వదులుతుంటే థియేటర్లు వన్స్ మోర్ అన్న రోజులు చాలానే ఉన్నాయి. అయన స్క్రీన్ పై అలా గలగలా మాట్లాడుతుంటే, అభిమానులు వింటూ ఉండిపోతారు. ఇక అలాంటి హీరోకు మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ లాంటి దర్శకుడు దొరికితే ఎలా ఉంటుంది? అందుకే ‘అరవింద సమేత’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో డైలాగ్స్ పాపులర్ అయిపోయాయి.
ఇక సినిమాలో ఎలా ఉండబోతోందో అనే అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయితే, ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో త్రివిక్రమ్ చెప్పిన ఒక విషయం ఫ్యాన్స్ ను కలవర పరుస్తోంది. ఈ సినిమాలో మొదటి అరగంట సేపు ఎన్టీఆర్ కు పెద్దగా మాటలు ఉండవట, మరీ అవసరం అయినప్పుడు మాత్రమే నోరు తెరుస్తాడని తెలిపారు త్రివిక్రమ్. అసలు ఎన్టీఆర్ లాంటి హీరోను మొదటి అరగంట మాటల్లెకుండా ఉంచడం అంటే ఎలా అని ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలో అయినా ఆ మొదటి అరగంట లోటు తీరుస్తాడేమో తెలియాలంటే అక్టోబర్ 11 దాకా ఆగాల్సిందే.
.

Discussion about this post