శ్రీకాళహస్తి పట్టణంలోని వన్నెకుల క్షత్రియ కమ్యూనిటీ భవనంలో గురువారం దక్షిణ భారత దేశ వన్నెకుల సంఘం నేతలకు ఘనంగా సన్మానం చేశారు.
దక్షిణ భారత దేశ వన్నెకులస్తుల సంఘ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మణి, విజయవాడ సంఘ అధ్యక్షులు కొల్లు రవి, చిత్తూరు జిల్లా ఫౌండర్ సురేష్ బాబు, కుప్పం సంఘ అధ్యక్షులు ఆండప్ప మొదలైన వారిని స్థానిక వన్నెకుల క్షత్రియ సేవా సంక్షేమ సంఘము, కుల పెద్దల ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆ సంఘం నేత సత్రవాడ ప్రవీణ్ మాట్లాడుతూ.. స్థానిక సంఘము అభివృద్ధి పథంలో ఉందని… దానికి దక్షిణ భారత దేశ సంఘం యొక్క సహాయ సహకారాలు చాలా అవసరమని కోరారు. సంఘ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో గల వన్నెకుల సంఘాల అభివృద్ధి కోసం, కమ్యూనిటీ భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణ కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు సత్రవాడ ప్రవీణ్, స్థానిక సంఘ అధ్యక్షులు కారూరు జనార్దన్ రెడ్డి, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు మన్నసముద్రం మస్తాన్ రెడ్డి, ఉపాధ్యక్షులు నెల్లూరు సుబ్రమణ్యం రెడ్డి, వేలూరు గుణశేఖర్ రెడ్ది, మాజీ కౌన్సిలర్ మన్నసముద్రం చెంగల్రాయ రెడ్డి,
జిల్లా సంఘ ఫౌండర్ ఆర్ సురేష్ బాబు, కె.యం. బాల మురుగన్, కుప్పం సంఘ అధ్యక్షులు ఆండప్ప, మామండూరు కన్నెప్పరెడ్డి, పుత్తూరు జయశంకర్ రెడ్డి, మప్పేటి నాధముని రెడ్డి, విజయవాణి స్కూలు శేఖర్ రెడ్డి మొదలైనవారు పాల్గొన్నారు.
.