చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలకసంఘం పరిధిలో 8మంది వలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ కమిషనరు బాలాజీనాయక్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జాయింట్ కలెక్టరు శ్రీధర్ ఆకస్మిక తనిఖీల తరువాత ఈ చర్యకు ఉపక్రమించడం చర్చనీయాంశంగా మారింది. విధుల నిర్వహణ సంతృప్తికరంగా లేదని… ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేర్చడం లేదనే కారణం చూపుతూ రెండు సచివాలయాల పరిధిలో 8మంది వలంటీర్లను తొలగించారు.
ఇందులో శ్రీకాళహస్తి పట్టణం శ్రీరామనగర్ కాలనీలో గల 19వ వార్డు సచివాలయ పరిధిలో పని చేసే ఆర్.సుమతి, ఎన్.సురేష్, ఎస్ కే నజీర్ బాషా… ఇదే ప్రాంతంలోని 20వ వార్డు సచివాలయ పరిధిలో పని చేసే ఎం.విష్ణువర్ధన్, బి.వెంకటబాలాజీ, ఎ.మునిప్రియ, ఎ.సుప్రియ, టి.విమల అనే వలంటీర్లను విధుల తొలగిస్తున్నట్లు కమిషనరు బాలాజీ నాయక్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కేవలం రెండు సచివాలయాల పరిధిలో 8మంది వలంటీర్లను ఒకేసారి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
.