విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని పీడీఎస్ యూ రాష్ట్ర నూతన కోశాధికారి జాకీర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గుంటూరులో ఈ నెల 12, 13వ తేదీల్లో 22వ రాష్ట్ర మహాసభలు జరిగాయన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తనను రాష్ట్ర కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్. జాకీర్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో విద్యార్థులు ఎదురుగా ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రధానంగా జిల్లాలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయంలో అనేక విద్యార్థుల సమస్యలు నెలకొన్నాయన్నారు.
వాటి సమస్యల కోసం యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్ పి.డి.ఎస్.యు రాష్ట్ర వర్గానికి విప్లవ వందనాలు తెలియజేశారు.
Discussion about this post