మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టిన యూట్యూబ్ నటుడు షణ్ముఖ్.. ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. యూట్యూబ్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ అనే యువకుడు తాగి వాహనం నడుపుతూ.. శనివారం నాడు హైదరాబాద్ జూబ్లిహిల్స్ పి ఎస్ పరిధిలో రెండు కార్లు రెండు ద్విచక్ర వాహనాలను కారుతో ఢీకొట్టాడు.
పోలీసుల షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకుని మద్యం సేవించిన విషయం నిర్ధరించేందుకు బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహించడంతో 170 శాతం నమోదు అయింది. దీంతో పోలీసులే ఖంగుతిన్నారు. ట్రాఫిక్ పోలీసులు కారు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
షణ్ముఖ జస్వంత్ యూట్యూబ్లో ఇటీవల పెళ్లి చూపులు వెబ్ సిరిస్ లో నటించి ఫేమస్ అయినట్లు తెలుస్తోంది. యు ట్యూబ్ స్టార్ షణ్ముక్ పై 337,279,185mv ఆక్ట్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన తర్వాత కూడా తాగిన మత్తులో.. కావాలంటే ఎంత డబ్బు కావాలో తీసుకోండి.. నన్ను ఇంటికి పంపించండి.. అంటూ షణ్మఖ జస్వంతో పోలీసులతో వాదులాడడం విశేషం.
మామూలుగా తాగుబోతు యాక్సిడెంట్లతో రీల్ లైఫ్ స్టార్లు చాలామంది రియల్ లైఫ్ లో విలన్లుగా ఎస్టాబ్లిష్ అయ్యే సంఘటనలు మనకు తెలుసు. షణ్ముఖ.. పేరుకు యూట్యూబ్ లో మాత్రం స్టార్ అయినప్పటికీ.. రియల్ లైఫ్ విలనీ చూపించడం విశేషం.
.