కోవిడ్ అనే మహమ్మారి వచ్చాక, దానికి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. అన్పాస్డ్ అనే సినిమా వాటిల్లోనుంచి ఒకటి. కానీ ఇక్కడ మనం మాట్లాడబోతున్నది దాని గురించి కాదు. కోవిడ్ గురించి తీస్తున్న సినిమాలలో జనాలలో ఉన్న భయాన్ని, మానసిక స్థితిని వాడుకుని తమ వ్యూస్ పెంచుకుంటున్నారు. వీటి గురించి ఇది చాలా చెడ్డ విషయం. కానీ, వాటిలో ఉండే కథ, మనుషుల కోసం ఏదో ఒక రకంలో శ్రద్ధ చూపించడం, ఇవన్నీ మనల్ని ఆ సినిమాలు చూసేటట్టు చేస్తాయి. కానీ, కొన్ని సినిమాలు ఒక అపోకలిప్స్ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో వస్తున్నాయి. అలాంటి సినిమాలలో మైకెల్ బే నిర్మించిన సాంగ్ బర్డ్ సినిమా ఒకటి. కానీ ఇప్పుడు ఇంకో సినిమా కూడా రాబోతోంది!! అది ప్రశాంత్ వర్మ తీసిన ‘జాంబీ రెడ్డి’!!
ఈ సినిమా టీజర్ మొదటిలో, ఒక గొంతు మనుషులు, రాక్షసులు, దేవుళ్లు గురించి ఒక శ్లోకం రూపంలో చెప్తుంది. తర్వాత మనకి ఒక గబ్బిలం కనిపిస్తుంది. చెట్టుకు అలా…. వేలాడుతూ….
తర్వాత కోవిడ్ వాక్సిన్ అని, గోడల మీద కోవిడ్ అని రాసుందనీ…. చాలా సీన్లు వస్తాయి. మధ్యలో ఆనంది త్రిశూలం పట్టుకుని ఉండడం, తేజా గద పట్టుకుని రావడం, దక్షా నగర్కర్ షాట్‌గన్ పట్టుకుని ఉండడం కూడా చూస్తాము. కానీ, జాంబీలు ఉంటాయి కాబట్టి, ఆ మేకప్ అంతా కొద్దిగ ఇబ్బందికరంగా అనిపించవచ్చు. సినిమా టీజర్ గురించి ఇవి సంగతులు.
.