మెగా డాటర్ నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రిసెప్షన్ కూడా ఘనంగానే పూర్తిచేశారు. ఇక హనీమూన్ పర్వం మిగిలి ఉంది. ఇది పూర్తిగా వాళ్ల ప్రెవేటు ఎఫైర్ అయినప్పటికీ.. వాళ్లంతట వాళ్లే ప్రతి చిన్న ఫోటోను ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్న నేపథ్యంలో ఎవ్వరికైనా ఆసక్తి ఉండడం సహజం. అయితే నిహారిక హనీమూన్ కూడా కాజల్ బాటలోనే జరగనున్నట్లుగా తెలుస్తోంది.
‘కాజల్ స్టయిల్లో’ అంటే సీక్రెట్ మరేమీ కాదు. కాజల్ – గౌతమ్ కిచ్లుతో తన వివాహం తర్వాత.. మాల్దీవ్స్ లో హనీమూన్ చేసుకుంది. ఈ సందర్భంగా హనీమూన్ పడకగది ఫోటోలతో సహా ఇన్స్టా, ట్విటర్ సోషల్ మీడియా వేదికల మీద పంచుకుంది. ఆమె మాల్దీవ్స్ లో బస చేసిన హోటల్ లో ఆమె ఉన్న గది ఖర్చు ఒక రోజుకు 37 లక్షల రూపాయలు అని.. ఆమె విమాన టికెట్లతో సహా హనీమూన్ మొత్తం ఖర్చు హోటల్ వారే పెట్టుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. కొవిడ్ తర్వాత.. మాల్దీవ్స్ ప్రభుత్వం టూరిజంను ప్రోత్సహించడానికి, పర్యాటకుల్ని ఆకర్షించడానికి ఇలా.. సెలబ్రిటీలకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఇస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
అదే మాదిరిగా నిహారిక దంపతులు కూడా.. మాల్దీవ్స్ కే హనీమూన్ నిమిత్తం వెళ్లవచ్చుననే ప్రచారం జరుగుతోంది. పెళ్లి, రిసెప్షన్ ఎంతో ఆడంబరంగా చేసుకున్న తర్వాత.. పుట్టినరోజును మాత్రం సింపుల్ గా ముగించిన నిహారిక.. హనీమూన్ కు ఒకవేళ మాల్దీవ్స్ కు వెళ్లకపోతే గ్రీస్ కు వెళ్లవచ్చునని కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
.