• About Us
  • Contact Us
  • Our Team
Saturday, August 15, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

PK effect : వైసీపీ ఎమ్మెల్యేల సీటు కదులుతోందా?

ప్రశాంత్ కిశోర్ ఏపీ రాజకీయాలపై నజర్ వేస్తున్నాడంటే.. వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు పుడుతోంది.

admin by admin
September 23, 2021
0
bjp raju fires on ys jagan

bjp raju fires on ys jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలో గుండెదడ మొదలైంది. ఎవరి మాటనైతే, ఎవరి సలహానైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేదవాక్కులా భావిస్తారో.. అలాంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేస్తున్నారనే సమాచారం వారిలో సరికొత్త భయాలకు కారణం అవుతోంది.

పనితీరు, ప్రజల్లో ఉండే ఆదరణ మాత్రమే ప్రాతిపదికలుగా జగన్మోహన్ రెడ్డి టికెట్ల కేటాయంపు చేస్తారనేది అందరికీ తెలిసిన సంగతి. ఆ ఆదరణను కూడా తన సొంత నెట్ వర్క్ ద్వారానే మదింపు చేస్తారని కూడా అందరికీ తెలుసు. ప్రభుత్వంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత.. ఎమ్మెల్యేల అందరి పనితీరును తూకం వేస్తున్నారని, ఇందుకోసం నియోజకవర్గాల్లో సర్వేలు జరుగుతున్నాయని అంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి తొలినుంచి సర్వేల మీద ఆధారపడుతున్నారు. ప్రజాదరణ లేదనిపించిన వారికి నచ్చజెప్పి పోటీనుంచి దూరం ఉంచుతున్నారు. వర్తమానంలోకి వస్తే.. ఆయన ఇప్పటికే పార్టీని రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాదనుంచి మంత్రులందరూ కూడా రోడ్లమీదే ఉండాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్మోహన్ రెడ్డి.. ఇటీవలి కేబినెట్ సమావేశం తర్వాత చెప్పిన సంగతి కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో.. ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది.

జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చు గానీ.. ఎన్నికలకు తయారు అవుతుండడం మాత్రం నిజం. మంత్రులను రోడ్లపైకి వెళ్లమనడం మాత్రమే కాకుండా.. ఇప్పటినుంచే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రస్తుత ఎమ్మెల్యేల ప్రజాదరణను తూకం వేయడానికి వారికి మళ్లీ టికెట్ ఇవ్వాలా వద్దా తేల్చుకోవడానికి జగన్ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.

చివరినిమిషంలోసర్వేలు చేసి.. సిటింగ్ ఎమ్మెల్యేలకు ప్రజాబలం లేదనిపిస్తే.. అప్పుడు కంగారుగా ఇతర ప్రత్యామ్నయ అభ్యర్థులకోసం వెతుక్కునే బదులుగా.. ఆ సర్వే ప్రక్రియను ఇప్పుడే పూర్తిచేసి.. పనితీరుసరిగా లేని ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయాలను కూడా చూస్తే.. సదరు ప్రత్యామ్నాయ అభ్యర్థులు ప్రజల్లో బలం పెంచుకోవడానికి వారికి రాబోయే రెండేళ్ల సమయం ఉపయోగపడుతుందనేది జగన్ వ్యూహం.

అందుకే ప్రశాంత్ కిశోర్ దళం కూడా రాష్ట్రంలో సర్వేలకు రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక విడత పూర్తయిందని కూడా అంటున్నారు. ఆ మేరకు కనీసం 70 మంది సిటింగ్ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోవచ్చు అనేది పార్టీలో వినవస్తున్న మాట. ప్రజాబలం పుష్కలంగా లేని ఎమ్మెల్యేలకు సూచన ప్రాయంగా పార్టీ హెచ్చరికలు కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :
ఏడుకొండవాడి దర్శనానికి కండీషన్లివే!
Rose Day : రోజాపూల దినోత్సవం కాదు, మరేంటి?
జగన్ సర్కారు పరువుపోయే ఎదురుదెబ్బ!
బీజేపీతో కయ్యానికి సై అంటున్న పవన్ కల్యాణ్
లవ్ స్టోరీతో శేఖర్ కమ్ముల తిరిగా ట్రాక్ మీదికి రాగలడా?

వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇది ప్రాథమిక సర్వే మాత్రమే. ముందు ముందు మరిన్న సర్వేలు జరుగుతాయని, ఎమ్మెల్యేలు, ఆశావహులు అప్పటికి పెంచుకోగల ప్రజాబలాన్ని బట్టి అభ్యర్థిత్వాలు కూడా మారుతాయని అంతా అనుకుంటున్నారు.

Tags: 2024 mla ticketsap cmjaganmohan reddypk survey for ysrcppk teamprasanth kishoreysrcp mlas
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply