• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, July 28, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

‘రామ్’ బాణమ్ : సినిమావాళ్ళు పాలిటిక్స్‌కు పనికొస్తారా?

admin by admin
October 17, 2021
0
‘రామ్’ బాణమ్ : సినిమావాళ్ళు పాలిటిక్స్‌కు పనికొస్తారా?

అది కవ్వించే కాసారం. పైకి అంతా తేటతెల్లం, నిశ్చలం. కానీ, అది జలగల సామ్రాజ్యం. మొసళ్ల నెలవు. ఆక్టోపస్ ల అడ్డా. షార్కుల స్వర్గం. అది మరి- రాజకీయం.

వారు కనువిందుచేసే కళాకారులు. చప్పట్లు కొడితే రెచ్చిపోతారు. ఈలల కోసం చచ్చిపోతారు. పొగడ్తలకు పడిపోతారు. భేషో అంటే ఉబ్బిపోతారు. జనం తమకోసం పడిఛస్తారని భ్రమిస్తారు. జనహృదయ దేవుళ్లు తామేనని నమ్ముతారు. విశ్వగతి మార్చే శక్తి తమకు ఉందనుకుంటారు. తలిస్తే కానిది లేదనుకుంటారు. వాపు బలుపనుకుంటారు. పగలే కలలు కంటారు. వారు మరి- సినిమా స్టార్లు.

1984లో- బాలీవుడ్ లో- అమితాబ్ బచ్చన్ టెంప్ట్ అయ్యాడు. ఫ్రెండ్ దూకమన్నాడని ముక్కుమూసుకుని దూకాడు. ప్రయాగ పవిత్ర జలాలనుకున్నాడు. ముందుగా సమ్మగా ఉంది. కాస్త దూరం ఈదాక అర్థమయ్యింది. జలగలు పట్టాయి. మొసళ్ళు పీకాయి. షార్కులు  నోరు తెరిచాయి. బురద బురదయ్యింది. ఒళ్ళు హూనమయ్యింది. జేబు గుల్లయ్యింది. కొంప కొల్లేరయ్యింది. దూకినంత వేగంగా ఒడ్డుకు చేరి.. బతుకు జీవుడా! అంటూ బట్టలు మూటకట్టుకొని యమస్పీడ్‌తో ఇంట్లో వచ్చి పడ్డాడు. అది రొచ్చు గుంటారా.. నాయనా.. అని ఇప్పుడు బోధిస్తాడు.

అరె ఓ సాంబా.. బచ్ గయారే హమారా బచ్చన్ సాబ్!

  = * =  

2008లో- టాలీవుడ్ లో- చిరంజీవి కి ఊపొచ్చింది. జగదేకవీరుడ్ని.. జేజేలు తప్పవనుకున్నాడు. ముందుచూపుతో గజ స్విమ్మర్లని (డాక్టర్ మిత్రా, డాక్టర్ పరకాల) పెట్టుకుని ఒక్క దూకు దూకాడు. బ్రెమ్మాండం బద్దలవుతుందని అనుకునే లోపే వారిద్దరూ తప్పుకున్నారు.  సారుకు వుడ్డుకుడిసినట్లయ్యింది. మురుగు నీళ్లతో గజ్జి తామర మొదలయ్యింది. తత్త్వం బోధపడింది. ఎంత ఊపుతో ఈదినా దరిచేరలేమని అర్థమయ్యింది. అందునా అడుగడుగునా సుడిగుండాలు, బుడుగుల మీద బుడుగులు. ఒంట్లో సత్తువ నశించింది.  కల  (ముఖ్యమంత్రి పీఠం) కల్లని అర్థమైంది. ఈలేస్తూ ప్రోత్సహించిన వాళ్ళకు చేయిచ్చి చిరు తృప్తితో మునుగుతూ తేలుతూ హమ్మయ్యా.. అని బయటపడ్డాడు.

వీర శంకర్ రెడ్డీ.. మొక్కే కదాని పీకేస్తే.. పీకించుకుని చక్కా చెక్కేస్తా!

  = * =  

2020లో- కోలీవుడ్ లో- రజనీకాంత్ రెచ్చిపోయాడు. పది సముద్రాలు ఒక్కసారే ఈదేస్తాననుకున్నాడు. చిటికె వేస్తే అంతా  అయిపోతుందకున్నాడు. తాను దూకితే తుక్కుతుక్కే అనుకున్నాడు. తాను మునిగితే సునామీ తప్పదనుకున్నాడు. స్విమ్ సూట్, లైఫ్ జాకెట్, స్పీడ్ బోట్ అన్నీ రెడీ అయ్యాయి. ముహూర్తం సిద్ధమయ్యింది. మంచి రసపట్టులో ఉండగా ప్రొజెక్టర్ పాడయ్యింది. రీలు తెగిపోయింది. సినిమా ఆగిపోయింది. హైదరాబాద్ వచ్చి ఒక మూడు రోజులు ఆసుపత్రిలో ఉండగానే నిర్ణయం మార్చుకున్నాడు. శకునం బాగోలేదు, విధి వక్రించింది. సిద్ధులు వద్దని సూచించారు. ఈతా వద్దు, రోతా వద్దని నిమ్మళంగా తప్పుకున్నాడు.

బ్రదర్.. పందులే పోలో మంటూ దూసుకుపోతాయ్.. సింహం సింగిల్‌గా జారుకుంటుంది!

  = * =  

అమితాబ్‌ది అనుభవజ్ఞత, చిరంజీవిది ప్రాప్తకాలజ్ఞత, రజనీ సారుది అసలు సిసలు విజ్ఞత- వాస్తవిక స్థితప్రజ్ఞత. సినీ తళుక్కులతో రాజకీయ కాసారంలోకి దూకి మునిగిన, తేలిన వాళ్ళు డజనుకు పైగానే ఉన్నా భారత రాజకీయ చరిత్రలో అమితాబ్, చిరంజీవి, రజనీ లు శాశ్వతంగా నమూనాలుగా మిగిలిపోతారు. సినిమాల్లో ప్రభవెలిగి ఆ ఊపుతో ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో అయితేనో, చిన్న చిన్న పదవులు కొడితేనో మనం లెక్కపెట్టవద్దు.  ఫిల్మ్-పాలిటిక్స్ గురించి వస్తే, శిఖర సమానులు.. మన అన్నగారిని, మన పిల్ల పురుచ్చి తలైవిని  మరవగలమా? కొన్ని సీన్లో, ఫస్టాఫో బాగుండి.. క్లైమాక్స్ ఘోరంగా ఉంటే సినిమా ఫ్లాప్ అయినట్లే అనుకుంటే గనక..ఈ రెండూ పెద్ద ఫెయిల్యూర్ స్టోరీస్. అట్టర్ ఫ్లాప్. తరచి చూస్తే గుండె తరుక్కుపోతుంది.

పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించిన ఎన్ఠీఆర్, మరో సినీ స్టార్ వారసురాలిగా అవమానాలు ఎదుర్కొని తమిళనాడును శాసించిన జయలలిత అధికారాంతంలో, జీవన చరమాంకంలో పడిన పాట్లు మామూలువా? అమితాబ్‌కు రెండేళ్ల ముందే రంగప్రవేశం చేసి పెద్దాయన ఒక పుష్కర కాలం రాజకీయాలను కిందామీదా చేస్తే, నిన్న మొన్నటి వరకూ జయమ్మ, మరో సినీ మనిషి కరుణ  లేని తమిళ రాజకీయాన్ని ఊహించలేకపోయాం.

వారి ప్రజాసేవను తక్కువచేయడం మహా పాపం. కానీ, పాపం.. జనం పడిచచ్చేలా చేసిన ఈ మహామహులు చివర్లో ఎంత దిక్కుమాలిన స్థితిని చవిచూశారు! రాజుల్లా వెలిగి అనాధల్లా మలిగిపోయారే! ఇక్కడ తన పిల్లనిచ్చి చేరదీసిన అల్లుడు, అక్కడ తాను చేరదీసి జీవితం ఇచ్చిన  నెచ్చెలి. మొత్తానికి మొత్తం ఈనగాచి నక్కల పాలయ్యింది గదా! వీరివి రెండూ మనసుకు తూట్లుపొడిచే అసంపూర్ణ విషాద అధ్యాయాలు మాత్రమే తప్ప దిగ్విజయ సుమధుర శుభం కార్డు గాధలు కావు.

ఎన్టీఆర్ లాగా డైవ్ కొడితే ఒక్క దెబ్బకు ఒడ్డుకు చేరాలి. అది అందరివల్లా కాదు. మానవ మాత్రుల వల్ల ఇప్పట్లో అయ్యేదా అది? అదొక అదృష్ట జాతకం, రాజ యోగం, వశీకరణ మంత్రం. అన్నగారిలాగా అందరికీ అన్నీ కలిసిరావు. అది- న భూతో న భవిష్యతి కేటగిరీ. ఆ రోజులు వేరు, వాతావరణం వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు, మేమేమి తక్కువ తిన్నామా? మేము పూసుకున్నదీ అదే రంగేగా? అని అనుకుంటే.. పొరపాటే. బొక్కబోర్లా పడడం ఖాయం. లైవ్ ఉదాహరణ- ప్రజారాజ్యం తధ్యమని నమ్మి ఆశలు రేకెత్తించిన కష్టజీవి చిరంజీవి. పది ఫ్లాప్స్ ఒక్కసారి వచ్చినట్లు కుదేలు కావాల్సివచ్చింది. అన్నయ్య కోలుకున్నా చేదు అనుభవం వెంటాడుతుంటుంది.  దైవ సమానుడైన అన్న కాడి దింపినా తెగించి తమ్ముడు దూకాడు. నీళ్లనుకుని దూకితే నేల మీద పడ్డాడు. డైలాగులకు కరతాళధ్వనులు వేరు, ఓట్లు వేయడం వేరని ఒకచోట కాదు, రెండు చోట్ల తెలియజెప్పారు. గొప్ప విషయం ఏమిటంటే.. అన్నను ఆదర్శంగా తీసుకోకుండా తమ్ముడు పట్టువదలని విక్రమార్కుడిలా రెండో సారి ప్రయత్నం చేస్తున్నాడు. రెండోసారి కాకపోతే, మూడో సారి వర్కవుట్ కావచ్చు. కావాల్సింది.. మరింత ఓపిక, తీరిక. హార్డ్ వర్క్ పేస్.

ప్రపంచ సినీ పిచ్చోళ్ళ రాజధాని (తమిళనాడు)లో కూడా విజయకాంత్ ముందుగా దూకాడు. దభేల్మని పడ్డాడు. వల్ల కాలేదు. తాజాగా కమల్ హాసన్ కూడా ట్రై చేశాడు. అస్సలు వర్కవుట్ కాలేదు. కమల్ కు కానిది తమిళనాడులో గానీ మన దేశంలో ఎక్కడైనా గానీ మరో సినిమా మనిషికి అయ్యే పనేనా? నాకైతే అనుమానమే. కారణాలు ఏవైనా, సినిమా వాళ్లకు ఆధునిక రాజకీయాల్లో కాలం చెల్లిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అట్లని అసంభవమని కూడా చెప్పలేం. మన స్టార్లు రాణించలేకపోవడానికి/ రాణించడానికి అవకాశం లేకపోవడానికి కారణాలేమిటని ఒక విస్తృత పరిశోధన చేస్తున్నా. ఇంతవరకూ.. మేధోమథనంలో లభించిన సమాచారం ప్రకారం ఈ కింది అరడజను కారణాలు దీనికి కనిపించాయి.

1) వారికున్న భయంకరమైన అహంకారం
2) తమకే అన్నీ తెలుసన్న మూర్ఖత్వం
3) భావోద్వేగం, అపనమ్మకం, హ్రస్వ దృష్టి లాంటి మానసిక వికారాలు  
4) చటుక్కున సీఎం అయిపోవాలన్న మితిమీరిన తహతహ
5) తేలిగ్గా చాపచుట్టేసే ఓపికలేమి
6) ఎక్కడలేని పీనాసితనం

ఇదిలా ఉంటే, సార్వత్రిక ఎన్నికలకు తీసిపోని విధంగా ఇంకా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో తిక్క మాటలు, ఎడ్డె చేష్టలు, పిచ్చి వ్యూహాలు, కువిమర్శలు, ప్రతి విమర్శలు, బెదిరింపులు, ఏడుపులు, పెడబొబ్బలు జనాలకు మస్తు మజా ఇచ్చాయి. మినీ రాజకీయ సమరం చేసారు కదా… ఈ సినిమా వాళ్ళు!  తామంతా కళామతల్లి బిడ్డలం, తామంతా ఒక్కటే, ఒకే మాట-ఒకే బాట అని కూసుకుంటూనే కాటు వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో పొలిటీషియన్లను తలదన్నేలా రెచ్చిపోయి నటించేశారు. ఆ పిల్లోడి చేయి ఆమె ఎందుకు నోరారా కోరినట్లు? అనేది “కట్టప్ప ఎందుకు వెన్ను పోటు పొడిచినట్టు?” అన్నంత చర్చనీయాంశం అయ్యింది. కుండబద్దలు కొట్టే రాజశేఖర్ ను ఇంట్లో ఉంచేసి జీవిత వచ్చారు. బ్యాలెట్ పేపర్లు మడతపెట్టి ఇంటికి పట్టుకుపోయారట. ముందురోజు ముందంజలో ఉండీ, మర్నాడు మటాష్ అయ్యారట ఒకరిద్దరు. ఇంకా ఇలాంటివి అనేకం. ఫన్ అన్ లిమిటెడ్.

నొప్పింపని తానొవ్వని చిరంజీవి, చిర్రెత్తించే వీడియో సందేశాల నాగబాబు, ఈ పెంట మనకెందుకు అన్నట్లు దూరదూరంగా ఉండిపోయిన సీనియర్ స్టార్లు, ‘ఇక్కడ ఎవడు తెచ్చాడు.. నేషనల్ అవార్డ్?” అని విర్రవీగిన ప్రకాశ్ రాజ్, “అవును.. అందరి డబ్బులు నేనే కట్టా…తప్పేంటి?’ అని కెమెరాల ముందు ఉన్నది ఉన్నట్లు మెరిసే కళ్ళతో విప్పి చెప్పేసిన విష్ణు,  ప్రశాంత్ కిషోర్ అన్నయ్యలా కింగ్ మేకర్ పాత్ర పోషించిన ఔట్ గోయింగ్ అధ్యక్షుడు నరేశ్, గురువు దాసరి నారాయణ రావు పాత్ర పోషించే పనిలో ప్రవచనాలు అందుకున్న మోహన్ బాబు, ఆయన నోటి కాటుకు బలైన వైరిపక్షపు బెనర్జీ బాబులు, పోలింగ్ రోజు రుసరుసలు, విసవిసలు, గుసగుసలు.. కరోనా బారిన పడకుండా ఉండేందుకు జనాలకు అత్యంత ఆవశ్యమని డాక్టర్లు చెప్పిన వినోదాన్ని పుష్కలంగా పంచాయి.

ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
నయీమ్ ఇట్లో పాములు తేళ్ల పెంపకం.. ఎందుకో తెలుసా?

నాకు బాగా నవ్వు తెప్పించిన అర్థంకాని సంగతి ఏమిటంటే.. ఒక బిల్డింగ్ గురించి ఈ అపరకుబేరులైన నటశేఖరులు నానావిధ ప్రకటనలు చేయడం. అదే వారి ప్రధాన అజెండా. పాతికేళ్ళకు పైబడిన ఈ అసోసియేషన్ లో కోటీశ్వర్లకు కొదవే లేదు, అయినా వీళ్లకు బిల్డింగ్ లేదు! ఇది అవమానం, అమానుషం, అసాధారణం, అసభ్యం.. అన్నీ. ఈ సంగతి అలా ఉంచితే.. విష్ణు తన మేనిఫెస్టోలో సినిమాల్లో మహిళలకు రక్షణ గురించి హై పవర్ కమిటీ ఏర్పాటుచేస్తామని చెప్పడం నాకు బాగా నచ్చింది. ఇది వెంటనే జరగాలి. శ్రీ రెడ్డి లాంటి అమ్మాయిలు బైటపడి బజారుకీడ్చిన నీచ సంసృతికి చరమ గీతం పాడాలి.  సినిమా సంఘం అంటేనే డ్రగ్స్ డెన్, బ్రోతల్ బ్యాచ్ అని వేళ్లూనుకున్న దరిద్రపు అభిప్రాయాన్ని తొలగించేలా అంతా కలిసి పనిచేయడం తక్షణావసరం. డబ్బు కోసం సినిమాలను గబ్బు పట్టించకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి సినిమాలు తీయడం మంచిది.
మోహన్ బాబు తన తనయుడి ప్యానల్ ప్రమాణస్వీకారం రోజున హితవు పలికినట్లు రాజకీయాలకు దూరంగా ఉండి అంతా కలిసి పనిచేయడం అత్యంత ఉత్తమం. మీకెందుకయ్యా స్వామీ..  పాలిటిక్స్?

ఇవి కూడా చదవండి :
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
రామ్ బాణం : జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి.. జర్నలిజం ప్రపంచానికే స్ఫూర్తి
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?

మీ పని మీరు హాయిగా చేసుకుని మంచి మంచి సినిమాలు బాధ్యతతో తీసి జనాలను అలరించి చరిత్రలో నిలిచిపోండి. ప్రజాసేవ చేయాలని ఉంటే ట్రస్టులు పెట్టి ట్రూత్‌ఫుల్‌గా మేలు చేయండి. సమాజాన్ని ఉద్ధరించే మంచి పనులు చేయడానికి ఈ పాలిటిక్స్ మీకెందుకు చెప్పండి! ఆ కాసారంలో దూకకుండా, సంపాదన పోగొట్టుకోకుండా  బైటి నుంచే ‘క్లీన్ పాలిటిక్స్’ కోసం జనాలను సమాయత్తం చేయండి, ప్రజాస్వామ్య గళాలకు బలమివ్వండి. బాధితులకు దన్నుగా నిలవండి. అన్నిటికన్నా ముఖ్యంగా.. డబ్బు కు ఓట్లు అమ్ముకోవద్దని మీ అభిమానులను చైతన్య పరచండి. ప్రజాస్వామ్యానికి, మంచి సమాజానికి అదే పదివేలు. ఒక సారి ఆలోచించండి.

..డాక్టర్ ఎస్. రాము
సీనియర్ పాత్రికేయుడు, జర్నలిజం బోధకుడు

డాక్టర్ ఎస్.రాము అన్ని వ్యాసాల కోసం క్లిక్ చేయండి

Tags: actors in politicsamitab bachanchanrababu naiduchiranjeevicinema industrydr ramu suravajjalaheroes in politicskollywoodmohan babunt ramaraopawan kalyanpolitical actorsprakash rajrajanikanthram banamRamu Suravajjalas ramutollywoodvijayakanthvishnu
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply