• About Us
  • Contact Us
  • Our Team
Thursday, July 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

నయీం డైరీస్ : ఒక సాహసోపేత ప్రయత్నం!

admin by admin
November 22, 2021
0
నయీమ్ డైరీస్ : నక్సల్ జీవితాల నగ్నస్వరూపం!

ఒక నరరూప రాక్షసుడిగా మీడియా ప్రచారం చేసిన నయీం వెనుక అసలు నిజాన్ని చెప్పే నిజాయితీ తో కూడిన ప్రయత్నం ” నయీం డైరీస్”

So the wrong-doer cannot do wrong without the hidden will of you all ___khaleel Jibran.

ప్రతి నేరం వెనుక ఉండే సామూహిక బాధ్యత ను మనందరం మరిచిపోయి నేరస్థులను రాక్షసులని తిట్టుకొని సంతృప్తి చెందుతూ వుంటాం. నేరస్థుల క్రౌర్యాన్ని ఖండించడం ద్వారా మన నైతిక ఔన్నత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ వుంటాం. దాము లాంటి కొందరు మాత్రం ఆ నేరస్తుడిలోని మనిషిని నిష్పాక్షికంగా బేరీజు వేసే ప్రయత్నం చేస్తారు.

మన లౌక్యాలు, బతక నేర్చిన తనాలు, కృత్రిమ ఆదర్శాలు , ఆవేశాలు, నైతిక దౌర్జన్యాలను దాటుకుని ఒక brutal honesty తో కూడిన జీవన చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఒక సాహసోపేత ప్రయత్నమే ఈ “నయీం డైరీస్”.

సినిమా ఒక గాఢమైన అనుభూతి అని నమ్మే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. దర్శకుడు దాము జరిపిన లోతైన పరిశోధన , దానిని బిగి సడలని ఒక మంచి కథనం గా మలచడం , అద్భుతమైన లొకేషన్లు ,పాత్రలకు సరితూగే నటులను ఎంచుకోవడం, సన్నివేశ కల్పన లో చూపిన నేర్పు , పాత్రోచిత ,సందర్భోచిత సంభాషణలు ప్రేక్షకుడికి ఒక పరిపూర్ణమైన అనుభూతి ని ఇస్తాయి.

ఈ సినిమా ఇంత ప్రత్యేకం గా ఉండటానికి ప్రధాన కారణం- దర్శకుడికి ఈ సబ్జెక్ట్ పైవున్న పట్టు. మాజీ నక్సల్ అయిన దాము సృష్టించిన జైలు సన్నివేశాలు వాస్తవికంగా వుండి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తాయి. అలాగే Authentic conversations ఇంకో మంచి అంశం. నిజమైన నక్సల్స్ చర్చల్లో కూర్చున్నామనే ఫీలింగ్ వచ్చేలా సంభాషణ లు నడిచాయి. దాము తన జీవితానుభవాన్ని రంగరించి సృష్టించిన సినిమా కాబట్టి authenticity అనేది సినిమా అంతటా పరుచుకుంది.

ఇందులో నాకు నచ్చిన మరో అంశం Voice over ను ఒక Narrative జిగురు గా వాడుకోవడం. అందువల్లనే Docudrama లా మారే ప్రమాదాన్ని తప్పించుకుని ఒక immersive drama గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది.
ఈ సినిమా లో మరొక హైలైట్ action scenes. సగటు తెలుగు సినిమాల్లో కనిపించే విచిత్ర విన్యాసాలు కాకుండా, అత్యంత వాస్తవికంగా వుంటూనే action cinema అభిమానుల ను సైతం థ్రిల్ చేసేలా వాటిని రూపొందించటంలో దాము అద్భుతమైన నేర్పును ప్రదర్శించాడు. స్టంట్ మాస్టర్ తో పని లేకుండా దాము కొన్ని action సన్నివేశాలు రూపొందించడం విశేషం.

ఇక నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. ముఖ్యంగా నయీం పాత్ర ధారి వశిష్ట సింహ నయీం పాత్ర లోని వైరుధ్యాలను అద్భుతంగా ప్రదర్శించ గలిగాడు. నయీం లోని క్రౌర్యాన్ని , ప్రేమను , జిత్తుల మారి తనాన్ని, చివరి సన్నివేశాలలో నిస్సహాయతను వశిష్ట సింహ అద్భుతంగా ఆవిష్కరించాడు. అలాగే నయీం ను వాడుకొనే పోలీస్ పాత్రలో కనిపించిన కొత్త నటుడు కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఎక్కడా కృత్రిమత లేకుండా అత్యంత సహజమైన నటనను నటుల నుండి రాబట్టడం లో దర్శకుడు పూర్తిగా సఫలమయ్యారు.

ఫోటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.అడవి దృశ్యాలు చూస్తుంటే ఏదో హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగి తీరుతుంది. అలాగే blank walls తో కూడిన జైలు సన్నివేశాల చిత్రీకరణ లో సినిమాటోగ్రాఫర్ నేర్పు కనిపిస్తుంది.
దశాబ్దాల పాటు సాగిన ఒక జీవన ప్రస్థానాన్ని రెండు గంటల సినిమా లో, ఒక అర్థవంతమైన కథ గా మలచడం మామూలు విషయం కాదు. దానికి subject పై command తో పాటు, narrative టెక్నిక్ తెలిసి ఉండాలి.

జపనీస్ దర్శకుడు Ozu సినిమాల్లో కనిపించే temporal ellipsis ను ఈ సినిమా లో దాము వాడుకున్న పద్ధతి అద్భుతంగా వర్కౌట్ అయింది.ఈ టెక్నిక్ Audience ను రెస్పెక్ట్ చేయడంతో పాటు వాళ్ళని కథలో పరిపూర్ణంగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది.

Commerciality కోసం కథను పక్క దోవ పట్టించే అనవసరపు పాటలు, వెకిలి హాస్యం, పిచ్చి పంచ్‌లు లేకుండా సినిమా తీసి మెప్పించవచ్చు అని దాము ప్రూవ్ చేశాడు.

చిన్న బడ్జెట్‌లో ఒక magnum opus లాంటి సినిమాను రెండు భాషల్లో రూపొందించటం‌లో దర్శకుడు దాము నిర్విరామ శ్రమ‌, పట్టుదల, నిబద్ధత వున్నాయి. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేం 24 crafts పట్ల దాము కున్న లోతైన అవగాహన కు నిదర్శనం అంటే అతిశయోక్తి కాదు.

Congratulations Daamu Balaji !!!

– శివుడు,
దర్శకుడు, బ్రాందీ డైరీస్

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

తమ్మినేని అలా చేస్తే జగన్‌కు చిక్కులేనా?

‘రామ్’ బాణమ్ : మోడీ ‘వెనక్కి’-బాబు ‘వెక్కి వెక్కి’

Good Morning : ఇలా మనం చేయగలమా?

 

Tags: ca varadarajudaamu balajidirector daamu balajigangster nayeemnaxalite nayeemnayeem diariesnayeem diarynayeem life secretsnayeem movietelugu movie secretsనయీమ్ డైరీస్నయీమ్ డైరీస్ రివ్యూబ్రాందీ డైరీస్శివుడుశివుడు డైరక్టర్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

మూడుముళ్లు బలవంతంగా వేయిస్తారో.. ఏంటో..?

కథానిధి 21.6.26 సమీక్ష: కాలపు గాయాలకు అక్షరాల సాంత్వన

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply