శ్రీకాళహస్తి మునిసిపాలిటీ పరిధిలో 15వతేదీ బుధవారం తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
శ్రీకాళహస్తి పట్టణంలో త్రాగునీటి సరఫరా కు సంబంధించి పట్టణ శివారు నందు వున్న K.P కెనాల్ పంపు హౌస్ నందు గల ట్రాన్సఫర్మెర్ మరమ్మతులకు గురైంది.
దీని మరమ్మతులు చేపట్టే నిమిత్తం తాగునీటి సరఫరా ఆపుచేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ ప్రకటించారు.
తేది 15-12-2021 న త్రాగునీరు సరఫరా చేయుటకు కొంత అంతరాయం కలుగుతుందన్నారు.
పట్టణ ప్రజలు ఈ అసౌకర్యాన్ని గుర్తించి సహరించవలసినదిగా మునిసిపల్ కమీషనర్ బి. బాలాజీ నాయక్ కోరారు.
ట్రాన్స్ఫార్మర్ ను తొందరగా మరమ్మతులు చేసి పట్టణా ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకొనవసినదిగా ఇంజనీరింగ్ సిబ్బంది ని ఆదేశించారు.
.