తిరుపతి ఓరియంటల్ కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపాల్ సురేంద్రనాయక్, వార్డెన్ ను వెంటనే అరెస్టు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి డిమాండు చేశారు.
తిరుపతిలోని ఓరియంటల్ కళాశాల వద్ద శుక్రవారం ఐద్వా, డీవైఎఫ్ ఐ ఆధ్వర్యంలో పెద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలక్ష్మి మాట్లాడుతూ… టీటీడీ విద్యాసంస్థల్లో అనేకమంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు.
వీరంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనని ఆమె చెప్పారు. వీరి పేదరికాన్ని అడ్డం పెట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడటం చాలా బాధాకరమన్నారు.
హాస్టల్ వార్డెన్ సహకారంతో ప్రిన్సిపాల్ సురేంద్రనాయక్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. వీరిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు విధుల నుంచి తొలగించాలని డిమాండు చేశారు.
ఈ ధర్నాలో డీవైఎఫ్ జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఎస్ ఎఫ్ ఐ కార్యదర్శి మాధవ్, అక్బర్, డివైఎఫ్ఐ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేంద్ర, ఐద్వా నగర కార్యదర్శి జయంతి,
ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్న, నాగరాజు డివైఎఫ్ఐ నాయకులు చినబాబు, చరణ్ అజయ్ కుమార్ విద్యార్థి మహిళా యువజన తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post