చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండల తహసీల్దారు పరమేశ్వరస్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టరు హరినారాయణన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అవినీతి ఆరోపణలు రావడంతో తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయంపై గత నెల 26, 27వ తేదీల్లో రెండు రోజుల పాటు తిరుపతి అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పలు అక్రమాలు వెలుగు చూశాయి. కాలువ పొరంబోకు భూమికి అడ్డుగోలుగా పట్టాలు ఇచ్చి.. రిజిస్ట్రేషనన్ చేసినట్లు ఏసీబీ అధికారుల పరిశీలనలో తేలింది. అదేవిధంగా పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని పరాధీనం చేసినట్లు వారు గుర్తించారు.
తొట్టంబేడు తహసీల్దారు కార్యాలయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులు కలెక్టరు హరినారాయణన్ కు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా తహసీల్దారు పరమేశ్వర స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇందుకు సంబంధించి ఫూర్తి సమాచారం అందాల్సి ఉంది. కాగా తహసీల్దారు సస్పెండ్ కావడంతో ఆ కార్యాలయ మిగిలిన సిబ్బందిలో వణుకు పుడుతోంది. ఈ ఘటనలో ఇంకా ఎంత మంది సస్పండ్ అవుతారోనని ఆందోళన చెందుతున్నారు.
.
Discussion about this post