చేతులు పరిశుభ్రతతో అనేక రకాల వ్యాధులను దరి చేరకుండా కాపాడుకోవచ్చునని… ముఖ్యంగా పిల్లలకు వారి చిన్నతనం నుంచే చేతులు పరిశుభ్రం చేసుకునే విధంగా పెద్దలు శ్రద్ధ వహించాలి అని వైద్యాధికారులు సూచించారు.
ఏర్పేడు మండల పరిషత్ కార్యాలయం వద్ద గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏర్పేడు ఎంపీడీవో గిడ్డయ్య మండల వైస్ ఎంపీపీ జమ్మల శ్రీనివాసులు యాదవ్ తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఏర్పేడు పిహెచ్సి సిహెచ్ఓ శివరామరాజు, హెచ్ ఎస్ కళావతి, ఏఎన్ఎం లు కె .రిటా, వై గంగాదేవి తదితరులు పాల్గొని చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల కలిగే అనర్ధాలు చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల కలిగే మంచి గురించి స్థానిక అధికారులకు మహిళా సంఘాల ప్రతినిధులకు అవగాహన కలిగించారు.
ముఖ్యంగా చిన్న పిల్లల్లో చిన్ననాటి నుంచి చేతులు శుభ్రం చేసుకునే అంశంపై అవగాహన కలిగించాలని పెద్దలు కూడా పరిశుభ్రత పాటించాలని వారు సూచించారు.
తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల అనేక రకాల జబ్బుల నుంచి తప్పించుకోవచ్చునని కరోనా లాంటి మహమ్మారి కూడా దరిచేరదని వారు అవగాహన కలిగించారు.
.
Discussion about this post