జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటే ఎంత చురుగ్గా దూకుడుగా పనిచేస్తారో.. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల రిపేర్లకు శ్రమదానానికి పూనుకున్న సంఘటనల్లోనే నిరూపించారు. జనసేనాని మరింత చురుగ్గా రాజకీయ కార్యక్షేత్రంలో గడపబోతున్నాడని అభిమానులు అందరూ ఆశిస్తున్న తరుణంలో ఆయన ఒక అనూహ్యమైన స్టెప్ తీసుకుంటున్నారు.
జనసేన- తెలంగాణ శాఖ పార్టీని కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయడానికి జనసేనాని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ శాఖ క్రియాశీల కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహిస్తున్నారు. పార్టీ తెలంగాణ కార్యకర్తలకు, నాయకులకు పవన్ దిశానిర్దేశం చేస్తారు.
హైదరాబాద్ అజీజ్ నగర్ లోని జె.పి.ఎల్.కన్వెన్షన్ లో జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ కీలకోపన్యాసం చేస్తారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ తెలంగాణ శాఖను కూడా బలోపేతం చేయడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యం.
పార్టీ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే తెలంగాణలో క్షేత్ర స్థాయి నుంచి కమిటీల నియామకం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీలో క్రియాశీలక సభ్యులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.
వారిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ కీలకోపన్యాసం చేస్తారు. తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకువెళ్లడం, సంస్థాగత నిర్మాణం, ప్రజల పక్షాన నిలిచి పోరాడటంపై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం అసలు ఎజెండా.
అనూహ్య స్టెప్ ఇది!
తెలంగాణలో జనసేన పార్టీ నామమాత్రంగానే అస్తిత్వం కలిగి ఉంది. పైగా పవన్ కల్యాణ్ అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ శాఖలపై పూర్తి స్థాయిలో సమయం కేటాయించి పనిచేసే స్థితిలో లేరు. ఏపీ రాజకీయాల్లో తాను, తన జనసేన పార్టీ ఒక కీలక నిర్ణాయక శక్తిగా ఇప్పటికే అవతరించిన తరుణంలో.. పవన్ ఫోకస్ అక్కడి పార్టీపై మరింత అవసరం ఉన్నదనేది అభిమానుల అభిప్రాయం.
ఇదీ చదవండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ = గ్యాంగ్‌స్టర్ నయీమ్.. ఎలాగో తెలుసా
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పూర్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయింది. రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అన్న చంద్రబాబు తెలంగాణ పార్టీపై శ్రద్ధ పెట్టలేకపోయారు. ఆ పార్టీ తెలంగాణలో ఇంచుమించుగా బంద్ అయినట్లే. అదే సమయంలో జగన్ చెల్లెలు షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కేసీఆర్ మీద నిశిత విమర్శలతో ముందుకు వెళుతున్నారు. ఇలాంటి నేపథ్యలో.. ఇక్కడ రాజకీయ శూన్యత ఉండబోతున్నదని జనసేనాని అంచనావేశారో ఏమో తెలియదు గానీ.. మొత్తానికి అభిమానులకు అనూహ్యమైన రీతిలో తెలంగాణ పార్టీ శాఖ మీద.. కాన్సంట్రేషన్ పెంచుతున్నారు. మరీ ఇక్కడి పార్టీని కూడా.. ఏపీలో పార్టీకి సమానంగా ఎన్నికలకు సమాయత్తం చేస్తారో లేదో వేచిచూడాలి.
ఇవి కూడా చదవండి :
satire : అర్ధరాత్రి గునపం దరువులు
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
Discussion about this post