పవర్ స్టార్ మరియు జనసేనాని పవన్ కల్యాణ్ అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకరు. ప్రజలు ఆదరిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలడని అభిమానులు అనుకుంటున్న ప్రజానాయకుడు. మరి గ్యాంగ్‌స్టర్ నయీమ్ అంటే.. మాజీ నక్సలైటు. భూకబ్జాలు దందాలు, బెదిరింపులు, మర్డర్లలో పేరుమోసిన వాడు! ఇలాంటి ఇద్దరు వ్యక్తులకు మధ్య ‘ఈజ్ ఈక్వల్ టూ’ అనగలిగేంత సారూప్యత ఏముంటుందా? అని ఆశ్చర్యపోతున్నారా?
సిఎ వరదరాజు నిర్మాతగా.. మాజీ నక్సలైట్ దామూ బాలాజీ దర్శకత్వంలో.. గ్యాంగ్‌స్టర్ –కమ్- మాజీ నక్సలైట్ నయీమ్ జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డైరక్టర్ దామూ బాలాజీ నయీమ్ జీవితం గురించి లోతైన పరిశోధనతో వివరాలు సేకరించి కేరక్టర్ ను తీర్చిదిద్దారు. ఈ సినిమాలోని ఒక సంగతి తెలిసినప్పుడు మాత్రం.. మనం నివ్వెరపోతాం. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కు, గ్యాంగ్‌స్టర్ నయీమ్ కు భలే సారూప్యత కుదిరిదే అని అనుకోకుండా ఉండలేం.
ఎలాగో చూద్దామా..
1
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కరాటేలో బ్లాక్ బెల్ట్. కరాటేను ఒక పిచ్చిగా నిత్యం సాధన చేస్తుండేవాడు. పీపుల్స్ వార్ లోకి వెళ్లే వరకు కూడా అతని కరాటే ప్రాక్టీస్, కరాటే మీద వ్యామోహం సాగుతూనే ఉండేది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం కరాటే మాత్రమే కాదు.. కుంగ్‌ఫూ వంటి ఇతర మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకున్నారు. ఆయనకు మార్షల్ ఆర్ట్స్ పట్ల విపరీతమైన వ్యామోహం ఉంది. తన దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాల్లో ఫైట్స్ కూడా తనే కంపోజ్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ ను అంతగా ఇష్టపడతారు.
2
నయీమ్ యువకుడిగా ఉన్న రోజుల్లో రోడ్ల మీద అమ్మాయిలను ఏడిపించే ఆకతాయిలను వెంటబడి ఉరికించి మరీ కొట్టేవాడు. అప్పట్లో నయీమ్ కు అమ్మాయిల్లో ఒక రకంగా మంచి పేరే ఉండేది.
పవన్ కల్యాణ్ కూడా ఇదే తరహా ఆలోచనలు, దూకుడు ఉన్న వ్యక్తి. తాను నెల్లూరులో చదువుకుంటున్న రోజుల్లో అమ్మాయిలను ఏడిపించేవారిని కొట్టాలని చాలా సార్లు అనిపించిందని పవన్ కల్యాణ్ స్వయంగా అనేక సభల్లో చెప్పారు. ఈ పాయింట్ ఇద్దరికీ మ్యాచ్ అవుతుంది.
3
గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు తన అక్క జరీనా బేగం అంటే చాలా ప్రేమ. ఆమె పట్ల చాలా ఆప్యాయంగా ఉండేవాడు. పీపుల్స్ వార్ నక్సలైటుగా అరెస్టు అయి.. జైల్లో గడుపుతున్న సమయంలో ప్రతి ములాఖత్ కు నయీమ్ అక్క స్వయంగా వెళ్లి కలిసేది. జైల్లో ఉన్న నయీమ్ తో పాటు, అతని సహచరులకు కూడా ఇష్టమైన మాంసాహార వంటకాలు చేసుకుని వెళ్లి ఇచ్చేది. కేవలం అక్క జరీనా బేగం విషయంలో తాను అడిగిన న్యాయం చేయనందుకే.. ఆగ్రహించిన నయీమ్ పీపుల్స్ వార్ మీద పగబట్టి నక్సలైట్లను వరుసగా హతమార్చడం మొదలెట్టాడని, ఆ తర్వాతే గ్యాంగ్ స్టర్ అవతారం ఎత్తాడని కూడా అంటారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కూడా అక్కయ్యలు అంటే చాలా ప్రేమ అని చెబుతుంటారు. కాలేజీ చదివే రోజుల్లో తన అక్కని ఏడిపించే వారిని తలచుకుంటే ఆయన ఇప్పటికి కూడా ఆగ్రహంతో ఊగిపోతారు. అక్క పిల్లల పట్ల చాలా కన్సర్న్ తో ఉంటారని కూడా ఆయనను ఎరిగిన వారు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి :
జనం మెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
అనూహ్యమైన స్టెప్ వేసిన జనసేనాని పవన్ కల్యాణ్
ప్రభాస్ స్పిరిట్.. అర్జున్ రెడ్డి వాసన కొడుతుందా?
తతిమ్మా అంశాలన్నీ పక్కన పెట్టండి. ఈ మూడు అంశాలను గమనించినప్పుడు.. పవన్ కల్యాణ్ = నయీమ్ అని ఎవరికైనా అనిపిస్తుంది. కాకపోతే ఒకరు రుజుమార్గం వీడకుండా జనసేనాని అయ్యారు. లక్షలాది మంది జనానికి ఆరాధ్య హీరో అయ్యారు. నాయకుడు అయ్యారు. మరొకరు దారి తప్పిపోవడం వలన లక్షలాది మందిని పేరు వింటేనే బెదిరిపోయేంత ఘనమైన గ్యాంగ్‌స్టర్ అయ్యారు! అదీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు గ్యాంగ్‌స్టర్ నయీమ్ ల నడుమ సారూప్యతల సంక్షిప్త చరిత్ర!
funny note.. ఫోటోలో ఇద్దరూ ఒకేతరహాలో నుదుట పెద్ద బొట్టు పెట్టుకుని ఉండడం యాదృచ్ఛికం.
ఇవి కూడా చదవండి :
satire : అర్ధరాత్రి గునపం దరువులు
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
Discussion about this post